తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : చేవెళ్లలో బీఆర్ఎస్ రైతు నిరసన దీక్ష - BRS Leaders Protest in Telangana - BRS LEADERS PROTEST IN TELANGANA

By ETV Bharat Telangana Team

Published : Aug 22, 2024, 1:04 PM IST

Updated : Aug 22, 2024, 1:25 PM IST

Protests by BRS Leaders Across the Telangana : పంట రుణాల మాఫీపై నేడు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు నిరసనలు చేపట్టారు. అన్ని మండల, నియోజకవర్గా కేంద్రాల్లో బీఆర్‌ఎస్ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. చేవెళ్లలో రైతులతో కలిసి ధర్నాలో బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పాల్గొన్నారు. ఆలేరు రైతులలో కలిసి మాజీ మంత్రి హరీస్‌ తమ నిరసను వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు ఆరు గ్యారంటీలంటూ ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా రాష్ట్రం ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు రుణమాఫీ రైతులందరికి జరగడం లేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మార్గదర్శకాల కారణంగా చాలా మంది రైతులు నష్ట పోతున్నారని వాపోయారు. రుణమాఫీ రాష్ట్రంలోని అందరి రైతులకు చేయాలని డిమాండ్ చేశారు. ఇది వరకు నుంచి రైతు రుణమాఫీపై కాంగ్రెస్ నేతలకు బీఆర్ఎస్‌ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వారంలోపు రుణమాఫీ అన్న తరుణంలో బీఆర్ఎస్‌ నేతలు ధర్నాకు తెర లేపారు.  
Last Updated : Aug 22, 2024, 1:25 PM IST

ABOUT THE AUTHOR

...view details