Published : Jun 21, 2024, 2:10 PM IST
|Updated : Jun 21, 2024, 2:44 PM IST
LIVE : తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల మీడియా సమావేశం - BRS leaders press meeT
BRS Leaders Press Meet at Telangana Bhavan : పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ చేరిన వేళ హైదరాబాద్‌లోని ఆయన నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పోచారం నివాసం వద్దకు వెళ్లారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. వారిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీనిపై హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ చేరడంపై అసహనం వ్యక్తం చేశారు. పోచారం నివాసానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మరికొందరు కాంగ్రెస్ నేతలు వెళ్లగా ఈ విషయం తెలుసుకుని బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, గెల్లు శ్రీనివాస్‌తో పాటు మరికొందరు పోచారం నివాసంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే వీరిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
Last Updated : Jun 21, 2024, 2:44 PM IST