LIVE : తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ నేతల మీడియా సమావేశం - brs leaders PRESS MEET - BRS LEADERS PRESS MEET
Published : Jun 19, 2024, 12:26 PM IST
|Updated : Jun 19, 2024, 12:35 PM IST
BRS Leaders Press Meet : తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణ సాధ్యం కానీ హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తోందని ఆయన మండిపడ్డారు. కాళేశ్వరంపై అనవసర రాద్ధాంతం చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలులో అక్రమాలు జరిగాయంటూ కొత్త పాట అందుకుందని ఆరోపించారు. అత్యవసర సమయంలో కొనుగోలు చేసిన విద్యుత్ విషయంలో ఇలా రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం రాజకీయంగా వేధించడం అని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఇలాంటి రాజకీయ వేధింపులు ఆపివేయాలని కొప్పుల డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్ అయిందని బిహార్ నుంచి సాక్ష్యాలు కనిపిస్తున్నా... పేపర్ రద్దు చేయాలని రేవంత్ ప్రభుత్వం కేంద్రాన్ని ఎందుకు డిమాండ్ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. నీట్ పేపర్ లీక్ వల్ల ఎంతో మంది తెలంగాణ విద్యార్థులు నష్టపోయాలని వారి ఆవేదని హస్తం నేతలకు కనిపించడం లేదా అని ఆయన ధ్వజమెత్తారు.
Last Updated : Jun 19, 2024, 12:35 PM IST