తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : తెలంగాణ భవన్​ నుంచి బీఆర్​ఎస్​ నేతల మీడియా సమావేశం - telangana bhavan

By ETV Bharat Telangana Team

Published : Mar 7, 2024, 2:05 PM IST

Updated : Mar 7, 2024, 2:30 PM IST

పాలమూరులో నిర్వహించిన కాంగ్రెస్ ప్రజా దీవెన సభలో సీఎం రేవంత్​ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్​ఎస్​ నేతలు మండిపడుతున్నారు. బీఆర్​ఎస్​ అంటే బిల్లా, రంగా సమితి అని హరీశ్​రావు, కేటీఆర్​ను చూస్తే బీఆర్​ఎస్​ బిల్లా, రంగా సమితి అనిపిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్​ సభా వేదికగా విమర్శించారు. అధికారం పోగానే బీఆర్​ఎస్​ నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. దేశంలోని మోదీతోనైనా, రాష్ట్రంలోని కేడీతోనైనా కొట్లాడతానని వ్యాఖ్యానించారు. పాలమూరును అభివృద్ధి వైపు నడిపించే బాధ్యత తనది అంటూ రేవంత్​ మాట్లాడారు.అయితే ఈ వ్యాఖ్యలపై బీఆర్​ఎస్​ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. పాలమూరు వేదికగా సీఎం చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని ఇప్పటికే హరీశ్‌రావు పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌ వెనకబాటుతనానికి కారణం కాంగ్రెస్సేనని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్‌ లోపాలు పాలమూరు పాలిట శాపాలుగా మారాయని మండిపడ్డారు. పాలమూరు వలసలకు కారణం కాంగ్రెస్సేనన్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదన్న ఆయన, కేసీఆర్ కిట్లు తెస్తే, సీఎం రేవంత్‌రెడ్డి తిట్లతో పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇదే విషయంపై తాజాగా తెలంగాణ భవన్​లో నేతలు ప్రెస్​మీట్​ ఏర్పాటు చేసి మాట్లాడుతున్నారు.
Last Updated : Mar 7, 2024, 2:30 PM IST

ABOUT THE AUTHOR

...view details