LIVE : తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియా సమావేశం - KTR Press Meet at Telangana Bhavan
Published : Jun 20, 2024, 4:04 PM IST
|Updated : Jun 20, 2024, 4:59 PM IST
KTR Press Meet at Telangana Bhavan : నీట్, నెట్ తదితర పరీక్షలు నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అసమర్థతపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేశారు. యూజీసీ నెట్ పరీక్షలను ఎన్టీఏ రద్దు చేసిన నేపథ్యంలో ఎక్స్ వేదికగా కూడా ఆయన స్పందించారు. నీట్ పరీక్షలో వైఫల్యాలను సమీక్షించి చర్యలు తీసుకోకముందే సమగ్రత విషయంలో రాజీపడరాదనే యూజీసీ నెట్ పరీక్షను ఎన్టీఏ రద్దు చేసిందని తెలిపారు. 11 లక్షలకు పైగా అభ్యర్థులు నెట్ పరీక్షకు హాజరయ్యారన్నారు. నీట్ విషయంలో కూడా ఇలాంటి గందరగోళమే వ్యక్తమవుతుందని ఆయన ఆవేదన చెందారు. ఈ విషయాలపై కేంద్రమంత్రి వివరణ ఇవ్వాలని కేటీఆర్ కోరారు. అయితే యూజీసీ-నీట్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నదని చెప్పారు. పలు హైకోర్టుల్లో నీట్‌పై జరిగే విచారణలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన విషయాలను ప్రస్తావించారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో పార్టీ ముఖ్యనేతలతో కలిసి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు.
Last Updated : Jun 20, 2024, 4:59 PM IST