తెలంగాణ

telangana

ETV Bharat / videos

జగిత్యాల చాయ్‌ పే చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ అర్వింద్​ - MP Arvind in Chai Pe Charcha - MP ARVIND IN CHAI PE CHARCHA

By ETV Bharat Telangana Team

Published : Apr 12, 2024, 10:30 PM IST

BJP MP Arvind Participate in Chai Pe Charcha : 47 ఏళ్ల రాజకీయ జీవితంలో నిజామాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి టి. జీవన్‌రెడ్డి చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని బీజేపీ నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ డిమాండ్​ చేశారు. జగిత్యాల మంచినీళ్ల బావి సమీపంలో ఏర్పాటుచేసిన చాయ్‌ పే చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, కాంగ్రెస్​పై తీవ్రంగా మండిపడ్డారు. ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి గెలిచి నాలుగు సంవత్సరాలు గడిచినా, ఇందూరు జిల్లాకు గాని, కోరుట్ల నియోజకవర్గానికి గాని ఎమ్మెల్సీ కోటాలో ఒక పైసా నిధులు కేటాయించారా ఆలోచించాలన్నారు.

జీవన్ రెడ్డి తనకు ప్రత్యర్ధి అయిన గౌరవంతోనే ఈ ఎన్నికల్లో కొట్లాడుతానని తెలిపారు. తన ఎంపీ పదవీకాలంలో పసుపు బోర్డు తీసుకువచ్చానన్న అర్వింద్​, పసుపు మార్కెట్ ఏ విధంగా అభివృద్ధి చేయాలో చేశానని అన్నారు. తన హయాంలో ఏడు రైల్వే ఓవర్ బ్రిడ్జిలు నిర్మించినట్లు ప్రజలకు వివరించారు. జగిత్యాల నుంచి వివిధ రాష్ట్రాలకు రైల్వేను పునరుద్ధరిస్తామని, కాంగ్రెస్ పార్టీలో ఉన్న కుటుంబ రాజకీయాలు బీజేపీలో ఉండవని అర్వింద్‌ పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details