లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ది రెండో స్థానం, బీఆర్ఎస్కు ఈసారి డిపాజిట్లూ దక్కవు : ఎంపీ అర్వింద్ - Lok Sabha Elections 2024
Published : Mar 23, 2024, 12:46 PM IST
BJP MP Aravind On Lok Sabha Elections 2024 : నిజామాబాద్ లోక్ సభ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అర్వింద్ బీజేపీ అభ్యర్థిగా రెండోసారి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి మరీ ఎన్నికల్లోకి వెళ్లారు. ఇటీవల పసుపు రైతుల కోసం పసుపు బోర్డు తీసుకొచ్చామని, ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఎంపీ ఇప్పుడు చక్కెర పరిశ్రమ తెరిపిస్తామంటూ ఈ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్తున్నారు. మోదీ హవాతో పాటు పసుపు బోర్డు, పసుపునకు అధిక ధరలు కలిసి వస్తాయని అర్వింద్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
లోక్ సభ ఎన్నికల సందర్బంగా బీజేపీ మేనిపెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్తామని అర్వింద్ తెలిపారు. బీజేపీ దేశ ఉన్నతి కోసం పని చేస్తుంటే, బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు కుల రాజకీయాలు చేస్తున్నాయని అంటున్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ రెండో స్థానానికే పరిమితమని, బీఆర్ఎస్ తెలంగాణలో ఎక్కడా డిపాజిట్లు దక్కవని అంటున్న నిజామాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌తో మా ప్రతినిధి ముఖాముఖి.