LIVE : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం - Kishan Reddy Live - KISHAN REDDY LIVE
Published : Apr 20, 2024, 4:28 PM IST
|Updated : Apr 20, 2024, 4:53 PM IST
BJP Leader Kishan Reddy Live From State Office : ఎన్నికల ప్రచారంలో అన్ని విషయాల్లో బీజేపీ ముందుందని కిషన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే ఐదు సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారని తెలిపారు. అందరికంటే ముందే అభ్యర్థులను ప్రకటించామన్నారు. బీఆర్ఎస్ చాలా బలహీనపడిందని ఆ పార్టీ దాదాపు కనుమరుగైందని ఎద్దేవా చేశారు. ఓడిపోయి 5 నెలలు గడిచినా ఓటమిని కేసీఆర్, కేటీఆర్ ఇంకా అంగీకరించలేదని అన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారటం చూసి కేసీఆర్ ఫ్రస్టేషన్‌లో ఉన్నారని అన్నారు. కుమార్తె లిక్కర్ కేసు, ఫోన్ల ట్యాంపింగ్ కేసుల్లో బీఆర్ఎస్ కూరుకుపోయిందని తెలిపారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు బీజేపీను విమర్శిస్తోందని తెలిపారు. జై శ్రీరామ్ నినాదం అన్నం పెడుతుందా ఉద్యోగాలు ఇస్తుందా అని కేటీఆర్ అన్నారని గుర్తు చేశారు. గెలిచిన ఎమ్మెల్యేలను నిలబెట్టుకోలేని స్థితిలో బీఆర్ఎస్ ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌పైన కూడా విమర్శలు చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడుతున్నారు.
Last Updated : Apr 20, 2024, 4:53 PM IST