అర్ధరాత్రి దడపుట్టిస్తున్న పోకిరీలు - నడిరోడ్డుపై డేంజరెస్ బైక్ స్టంట్స్ - BIKE RACING AT HYD IT CORRIDOR
Published : Jun 16, 2024, 11:28 AM IST
Bike Racing At Rayadurgam in Hyderabad : వీకెండ్స్ వస్తే చాలు హైదరాబాద్లో యువత రెచ్చిపోతున్నారు. లాంగ్ డ్రైవ్స్, నైట్ రైడ్స్ అంటూ రోడ్లపై కొంతమంది యువకులు నానా హంగామా చేస్తున్నారు. బైకులపై ప్రమాదకర స్టంట్లు చేస్తూ వాళ్ల ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవడమే కాకుండా ఎదుటి వారి ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో రాత్రిపూట బైక్ రేసింగ్లు ఎక్కువవుతున్నాయి. రోడ్లపై స్టంట్లు చేస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
అయితే స్టంట్లు చేసే వారిలో ఎక్కువగా టీనేజర్లు, మైనర్లు ఉండటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న విషయం. తాజాగా శనివారం అర్ధరాత్రి రాయదుర్గం ఐటీ కారిడార్ ప్రాంతంలో భారీగా బైక్ రేసింగ్ జరిగింది. వాహనాల రాకపోకలకు మధ్య బైకులపై స్టంట్లు చేస్తూ యువకులు హంగామా సృష్టించారు. అయితే తమ కళ్ల ముందే యువకులు ఇలాంటి ప్రమాదకర చేష్టలకు పాల్పడుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ బైక్ స్టంట్ వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి.