కోళ్లను తినడానికి వచ్చిన కొండచిలువ - ఇంతలో ఏం జరిగిందంటే? - BIG PYTHON SPOTTED IN WARANGAL - BIG PYTHON SPOTTED IN WARANGAL
Published : Aug 1, 2024, 10:20 AM IST
BIG PYTHON SPOTTED IN WARANGAL : వరంగల్ జిల్లాలో భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. పర్వతగిరి మండలంలోని తురకల గ్రామానికి చెందిన షరీఫ్ అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించింది. ఆయన నివాసంలోని కోళ్ల గూటిలోకి ప్రవేశించి, రెండు కోళ్లను ఆరగించింది. కదలడానికి వీలులేక కోళ్ల గూటిలోనే ఉండిపోయింది. అనంతరం కొండచిలువను చూసిన ఇంటి యజమాని షరీఫ్ కంగుతిన్నాడు. దానిని బయటకు లాగి కర్రతో కొట్టి చంపాడు. కొండచిలువను చూసిన గ్రామస్థులంతా భయాందోళనకు గురయ్యారు.
మరోవైపు మహబూబాబాద్ కొత్తగూడ మండలం వేలుబెల్లి పెద్ద చెరువులో 15 అడుగుల కొండ చిలువ లభ్యమైంది. మత్స్యకారులు చేపలు పట్టేందుకు చెరువులో వల ఏర్పాటు చేశారు. ఉదయం వెళ్లి చూడగా అందులో కొండచిలువ కనిపించింది. చేపలు పట్టేవారు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అధికారులు కొండ చిలువను పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలేశారు. వన్యపాణులకు ఏ హానీ చేయకుడా తమకు సమాచారమందించాలని ప్రజలకు సూచించారు.