పీవీ నరసింహారావుకు భారతరత్న - తెలుగు ప్రజలు ప్రతి ఒక్కరు గర్వించే రోజు : సురభి వాణిదేవి - Surabhi Vani reaction bharat ratna
Published : Feb 9, 2024, 3:34 PM IST
Bharat Ratna PV Narsimha Daughter MLC Surabhi Vani Reaction : మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించడంతో పీవీ కుమార్తై సురభి వాణిదేవి హర్షం వ్యక్తం చేశారు. పీవీకి భారతరత్న రావడం రాష్ట్ర ప్రజలకు దక్కిన గౌరవమని అన్నారు. కేంద్రానికి వాణి కృతజ్ఞతలు చెప్పారు. పీవీకి భారతరత్న ఇవ్వడాన్ని దేశ ప్రజలంతా హర్షిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ గర్వ పడుతున్నారని తెలిపారు.
ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో విద్యార్థుల ప్రధాన సమస్యలపై దృష్టి సారించి, ఇంగ్లీష్ మాధ్యమంలో విద్యను అభ్యసించడం ఇబ్బంది పడిన వారందరికోసం తెలుగు అకాడమీ స్థాపించారని చెప్పారు. అలా ప్రతి విద్యార్థికి తెలుగు పుస్తకాలను ఇచ్చి ఉన్నత విద్యలు అభ్యసించే దిశగా నడిపించారని పేర్కొన్నారు. కుటీర పరిశ్రమలు పెట్టుకునే విధంగా మహిళలకు అవకాశాలు కల్పించారని వివరించారు. ఇతర దేశాలు భారత్లో పెట్టుబడులు పెట్టి, వ్యాపారాలు చేసుకునే విధంగా ఆర్థిక సంస్కరణలు చేశారన్నారు.