భద్రాద్రి రామయ్య సన్నిధిలో వైభవంగా భక్త రామదాసు 391వ జయంతి ఉత్సవాలు - Bhadradri Temple news
Published : Feb 12, 2024, 2:03 PM IST
Bhakta Ramadasu Birthday Anniversary In Bhadradri : భద్రాద్రి రామయ్య సన్నిధిలో భక్త రామదాసు 391వ జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయంలోని భక్త రామదాసు విగ్రహానికి పంచామృతాలతో విశేష అభిషేకం నిర్వహించిన అర్చకులు, నూతన వస్త్రాలతో అలంకరించారు. భక్త రామదాసు చిత్రపటంతో ఆలయ ప్రదక్షిణ, గిరి ప్రదక్షిణ నిర్వహించారు. భద్రాద్రి ఆలయ నిర్మాణానికి విశేష కృషి చేసి, తన జీవితం మొత్తాన్ని సీతారాముల సేవకు అంకితం చేసిన పరమ భక్తుడు శ్రీ భక్త రామదాసు. ఈ జయంతి ఉత్సవాలను భద్రాద్రి ఆలయంలో ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తున్నారు.
Ramadasu 391th Birth Anniversary Celebrations In Bhadradri Temple : భక్త రామదాసు కీర్తనలను తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన సంగీత కళాకారులు, విద్వాంసులు ఆలపిస్తున్నారు. ఆలయంలోని చిత్రకూట మండపంలో శ్రీ భక్త రామదాసు జయంతి వేడుకలు జరుగుతున్నాయి. ఆలయంలోని సీతారాములను ఆ మండపం వద్దకు తీసుకువచ్చి కంచర్ల గోపన్న కీర్తనలు ఆలపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అనేక మంది సంగీత కళాకారులు, విద్వాంసులు, పండితులు పాల్గొన్నారు.