తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం - BALKAMPET YELLAMMA KALYANAM LIVE - BALKAMPET YELLAMMA KALYANAM LIVE

By ETV Bharat Telangana Team

Published : Jul 9, 2024, 9:10 AM IST

Updated : Jul 9, 2024, 12:22 PM IST

Balkampet Yellamma Kalyanam Live :  బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం ప్రారంభమైంది. ఉత్సవాలకు ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లు చేశారు. స్థానికులు వాలంటీర్లుగా ఏర్పుడి ఉత్సవాల నిర్వహణ చూసుకుంటున్నారు. అమ్మవారికి 27 చీరలు, స్వామివారికి 11 పంచెలతో అలంకారం చేశారు. స్వామి అమ్మవార్ల కల్యాణ మహోత్సవానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఎల్లమ్మ కల్యాణోత్సవ వేడుకల నేపథ్యంలో సోమవారం నుంచి 10వ తేదీ వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులోకి వచ్చాయి. ఈ మేరకు నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలపై, ట్రాఫిక్‌ అదనపు పోలీసు కమిషనర్‌ పి.విశ్వ ప్రసాద్‌ ఒక ప్రకటనలో విడుదల చేశారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణం చేయాలని సూచించారు. ఆర్‌అండ్​బి కార్యాలయం, నేచర్‌క్యూర్‌ ఆసుపత్రి, జీహెచ్‌ఎంసీ గ్రౌండ్స్, పద్మశ్రీ అపార్ట్‌మెంట్స్‌ నేచర్‌క్యూర్‌ ఆసుపత్రి రోడ్‌ సైడ్‌ వైపు, ఫతేనగర్‌ రైల్వే వంతెన కింద, పద్మశ్రీ అపార్ట్‌మెంట్స్‌ నుంచి ఆర్‌ అండ్‌ బి కార్యాలయం వైపు పార్కింగ్‌ స్థలాలను కేటాయించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలిగినా సహాయం కోసం 90102 03626 కు ఫోన్‌ చేయవచ్చని ట్రాఫిక్ పోలీసులు ప్రకటనలో తెలిపారు.
Last Updated : Jul 9, 2024, 12:22 PM IST

ABOUT THE AUTHOR

...view details