రాష్ట్రంలో ఏరులై పారుతున్న మద్యం- అధికారులు ఏ పార్టీకీ కొమ్ముకాయొద్దు: బీఎస్పీ - Bahujan Samaj Party press meet - BAHUJAN SAMAJ PARTY PRESS MEET
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 1, 2024, 7:22 PM IST
|Updated : May 1, 2024, 10:53 PM IST
Bahujan Samaj Party State President Meeting : సార్వత్రిక ఎన్నికల్లో 166 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాల్లో బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పరంజ్యోతి తెలిపారు. విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీఎస్పీ పోటీలో ఉంటే ప్రధాన పార్టీలకు గట్టి దెబ్బ తగులుతుందని బయపడుతున్నారు. అందుకోసం ఆర్వోలను మేనేజ్ చేసి మా అభ్యర్థుల నామినేషన్లలో కొన్ని తిరస్కరించారని ఆరోపించారు. ఆర్వోలపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
అసెంబ్లీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురైనవి మినహా మిగిలిన 166 స్థానాల్లో బీఎస్పీ అభ్యర్థులు పోటీలో ఉన్నారని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ పరిధిలోకి వచ్చినా మద్యంపై నియంత్రణ లేదన్నారని విమర్శించారు. అధికారులు ఏ రాజకీయ పార్టీకి కొమ్ము కాయకుండా స్వేచ్చగా ఎన్నికలు జగిగే విధంగా చూడాలన్నారు. రాష్ట్రంలో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీలు బీజేపీకి అనుకూల పార్టీలే అని తెలిపారు. బహుజనులకు రాజ్యాధికారం వచ్చినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థులను ప్రజలు గెలిపించాలని పరంజ్యోతి విజ్ఞప్తి చేశారు.