CM Chandrababu Condolence to Manmohan Singh : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం చాలా బాధాకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సీఎంతోపాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు శబరి, కేశినేని చిన్ని మన్మోహన్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు.
దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయిందని ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. మన్మోహన్ సింగ్ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని చంద్రబాబు అన్నారు. మన్మోహన్‌సింగ్ దేశానికి అవిశ్రాంతంగా సేవలందించారని కొనియాడారు. ఆయన మృతి దేశానికి తీరని లోటన్నారు.
"మన్మోహన్‌సింగ్ మరణం చాలా బాధాకరం. దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయింది. దేశానికి మన్మోహన్‌సింగ్ అవిశ్రాంతంగా సేవలందించారు. దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. ఉపాధి హామీ, ఆధార్, ఆర్టీఐ, విద్యా హక్కు చట్టం తీసుకొచ్చారు. అనేక పదవులను మన్మోహన్ సమర్థంగా నిర్వహించారు." - చంద్రబాబు, సీఎం
ఆర్థిక వ్యవస్థను వృద్ధి పథంలో నడిపించారు : మన్మోహన్‌సింగ్ మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందని ఉపముఖ్యమంత్రి పవన్ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశాన్ని ఆర్థికంగా మన్మోహన్ కొత్త పుంతలు తొక్కించారని కొనియాడారు మన్మోహన్‌సింగ్ అందించిన సేవలు చిరస్మరణీయమైనవని వివరించారు. మన్మోహన్‌సింగ్ మృతి పట్ల మంత్రి లోకేశ్ సంతాపం తెలిపారు. ఆయన ఆర్థిక వ్యవస్థను వృద్ధి పథంలో నడిపించారని కొనియాడారు. మన్మోహన్‌సింగ్ మృతి దిగ్భ్రాంతిని కలిగించిందని అన్నారు.
మన్మోహన్ సింగ్ జీవితం భావి తరాలకు ఆదర్శం: ప్రధాని నరేంద్ర మోదీ
మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మృతిపట్ల పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు సంతాపం ప్రకటించారు. ఆర్థిక సంస్కరణలతో దేశానికి దిశానిర్దేశం చేశారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు గుర్తు చేశారు. ప్రధానిగా, ఆర్బీఐ గవర్నర్‌గా, ఆర్థికమంత్రిగా తనదైన ముద్రవేశారని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. మన్మోహన్ మృతి దేశానికి తీరనిలోటని మంత్రి అనగాని సత్యప్రసాద్, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు.
'గొప్ప ఛాంపియన్‌ను కోల్పోయాం'- మన్మోహన్ మృతి పట్ల ప్రపంచ దేశాల సంతాపం
ప్రధానిగా, కేంద్ర ఆర్థికమంత్రిగా మన్మోహన్ సింగ్ సేవలు అమూల్యం : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం అత్యంత బాధాకరమని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. భారతదేశ ఆర్థిక రూపశిల్పి, సంస్కరణలకు ఆద్యుడు, అవిశ్రాంత యోధుడు, మహోన్నత నాయకుడని కొనియాడారు. మన్మోహన్ మరణం దేశానికి తీరని లోటన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రెండు పర్యాయాలు దేశ ప్రధానిగా, కేంద్ర ఆర్థికమంత్రిగా అందించిన సేవలు అమూల్యమన్నారు. మన్మోహన్ ప్రభుత్వం తెచ్చిన సమాచార హక్కు చట్టం పౌరుల హక్కులను కాపాడితే, ఉపాధి హామీ పథకం నిరుపేదల జీవితాలకు మార్గదర్శి అయిందని గుర్తు చేశారు.
అవిశ్రాంత యోధుడు మన్మోహన్- రోజుకు 18 గంటల పని- పీవీ అంచనాలను సాకారం చేస్తూ!