ETV Bharat / state

అల్లు అర్జున్‌ బెయిల్‌ పిటిషన్‌ - విచారణ వాయిదా వేసిన కోర్టు - ALLU ARJUN CASE ADJUOURNED

అల్లు అర్జున్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణను సోమవారానికి వాయిదా వేసిన నాంపల్లి కోర్టు

allu_arjun_case_adjuourned
allu_arjun_case_adjuourned (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 27, 2024, 3:11 PM IST

Nampally Court Adjuourned Hearing on Allu Arjun Bail Petition: సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. బెయిల్‌ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేసేందుకు పోలీసులు సమయం కోరగా నాంపల్లి కోర్టు విచారణను డిసెంబరు 30కి వాయిదా వేసింది. సంధ్య థియేటర్‌ ఘటనలో ఇటీవల అల్లు అర్జన్​ను పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు.

ఇక నాంపల్లి న్యాయస్థానం విధించిన 14 రోజుల రిమాండ్‌ కూడా ఈ రోజుతో ముగిసింది. దీంతో అల్లు అర్జున్ ఈ రోజు వర్చువల్‌గా న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. మరోవైపు తొక్కిసలాట ఘటనపై విచారణను కూడా నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. దీనిపై తదుపరి విచారణను జనవరి 10వ తేదీన చేపట్టనున్నట్లు నాంపల్లి కోర్టు వెల్లడించింది. అల్లు అర్జున్‌ రిమాండ్‌పై కూడా విచారణ ఆ రోజే జరగనుంది.

'రేవతి చనిపోయిందని థియేటర్​లో నాకు చెప్పలేదు' - భావోద్వేగానికి గురైన అల్లు అర్జున్​

సీఎం రేవంత్​ను కలిశా - అల్లు అర్జున్​ను కలుస్తాను - ఎలాంటి సమస్యలు రాకుండా చూస్తా: దిల్ రాజు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.