తెలంగాణ

telangana

ETV Bharat / videos

చంచల్​గూడలో చిన్నారి కిడ్నాప్ - గంటల వ్యవధిలోనే రెస్క్యూ చేసిన పోలీసులు - హైదరాబాద్​లో​ చిన్నారి కిడ్నాప్

By ETV Bharat Telangana Team

Published : Mar 3, 2024, 12:15 PM IST

Baby Kidnapped in Chanchalguda : ఈమధ్య కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కిడ్నాప్‌ కేసులు ఎక్కువ అయిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే తాజాగా హైదరాబాద్ చంచల్‌గూడలో 9 నెలల చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. చంచల్​గూడలోని నర్సింగ్ హోమ్​లో 9 నెలల చిన్నారి అపహరణకు గురైంది. మాదన్నపేట్ పోలీస్ స్టేషన్​లో బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీపుటేజీ ద్వారా జహీరాబాద్​లో కిడ్నాపర్​ను అదుపులోకి తీసుకొని పాపను తల్లిదండ్రులకు అప్పగించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : ఛత్తీస్‌గఢ్‌కు చెందిన షెహనాజ్‌ అనే మహిళ చంచల్​గూడలోని నర్సింగ్‌ హోంలో పనిచేస్తోంది. అక్కడ తొమ్మిది నెలల చిన్నారిని కిడ్నాప్ చేసి చంచల్‌గూడ నుంచి ఎంజీబీఎస్ వెళ్లి అక్కడి నుంచి బస్సులో జహీరాబాద్‌ వెళ్లింది. సీసీటీవీ కెమెరా దృశ్యాల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు జహీరాబాద్‌ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడ ఆమెను అదుపులోకి తీసుకొని పాపను తల్లిదండ్రులకు అప్పగించారు. ఫిర్యాదు  చేసిన గంటల వ్యవధిలోనే పాప కిడ్నాప్‌ కేసును పోలీసులు చేధించారు.

ABOUT THE AUTHOR

...view details