తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : రాజ్‌భవన్‌లో ఎట్‌ హోమ్‌ కార్యక్రమం - ప్రత్యక్షప్రసారం - AT HOME FUNCTION IN RAJ BHAVAN LIVE

By ETV Bharat Telangana Team

Published : Jan 26, 2025, 5:19 PM IST

Updated : Jan 26, 2025, 6:02 PM IST

At Home Function in Raj Bhavan LIVE : గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో 'ఎట్‌ హోం కార్యక్రమం' నిర్వహించారు. గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ ఆహ్వానం మేరకు పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు హాజరయ్యారు. ఏటా స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రంలోని ప్రముఖులను గవర్నర్‌ రాజ్‌భవన్‌కు ఆహ్వానించి తేనీటి విందు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. 76వ గణతంత్ర వేడుకల్లో భాగంగా సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో గవర్నర్ జిష్ణుదేవ్‌ వర్మ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రసంగించిన జిష్ణదేవ్‌ వర్మ ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించారు. వ్యవసాయం తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచిందని పేర్కొన్నారు. తెలంగాణ వృద్ధికి మౌలిక సదుపాయాల అభివృద్ధి ఇప్పటికీ కీలకమైనదని ఆయన అభిప్రాయపడ్డారు. మెట్రో రైలు నెట్‌వర్క్ విస్తరణ స్థిరమైన పట్టణ రవాణాను నిర్ధారిస్తుందన్నారు. మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా నిలుస్తుందన్నారు. ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వేలు, ప్రాంతీయ రింగ్ రోడ్డు నిర్మాణం కనెక్టివిటీ రాష్ట్రాన్ని మరో స్థాయికి తీసుకెళతాయన్నారు. రాజ్‌భవన్‌లో 'ఎట్‌ హోం' కార్యక్రమం జరుగుతోంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం. 
Last Updated : Jan 26, 2025, 6:02 PM IST

ABOUT THE AUTHOR

...view details