తెలంగాణ

telangana

FTL పరిధిలో ఉన్న నెక్లెస్‌రోడ్డు, జీహెచ్‌ఎంసీ కార్యాలయాన్ని కూలుస్తారా? - ఓవైసీ సంచలన వ్యాఖ్యలు - Asaduddin Owaisi comments on Hydra

By ETV Bharat Telangana Team

Published : Aug 25, 2024, 5:20 PM IST

Asaduddin Owaisi comments on Hydra (ETV Bharat)

Asaduddin Owaisi comments on Hydra : హైడ్రాపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌ పరిధిలో ఉన్న అన్ని ప్రభుత్వ భవనాలను కూల్చివేస్తారా అంటూ ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతంలో ఇప్పుడు ఉన్న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఫౌంటేన్ వద్ద ఉండేదని ఓవైసీ పేర్కొన్నారు. హుస్సేన్‌ సాగర్ ఎఫ్‌టీఎల్ పరిధిలో బల్దియా భవనాన్ని నిర్మించారని, దాన్ని కూడా కూల్చివేస్తారా? అంటూ సర్కార్‌ను నిలదీశారు. నెక్లెస్ రోడ్ కూడా ఎఫ్‌టీఎల్ పరిధిలోకి వస్తుందని, నెక్లెస్ రోడ్డును కూడా హైడ్రాతో కూలుస్తారా అని ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు.

ఎవరికైనా అనుమానం ఉంటే బఫర్ జోన్‌లో గతంలో స్టోన్స్ పెట్టేవారని వెళ్లి పరిశీలించుకోవచ్చు అని అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు. హైడ్రాకు లెజిస్లేటివ్ లీగల్ బ్యాకింగ్ లేదని తమ కార్పొరేటర్లు మేయర్‌కు తెలిపారని ఆయన స్పష్టం చేశారు. నగరంలో చెరువులను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై హైడ్రా కొరడా ఝళిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు 18 ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను హడ్రా నేలమట్టం చేసింది. 

ABOUT THE AUTHOR

...view details