ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE: కేబినెట్ నిర్ణయాలు వెల్లడిస్తున్న మంత్రి పార్థసారథి - ప్రత్యక్ష ప్రసారం - AP CABINET BRIEFING LIVE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 17, 2025, 3:35 PM IST

Updated : Jan 17, 2025, 4:04 PM IST

AP Cabinet Briefing By Minister Kolusu Pardhasaradhi LIVE : ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. పలు ముఖ్యమైన అంశాలపై కేబినెట్ కీలక చర్చలు జరుపుతోంది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు కోసం 700 కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు ఏపీ మార్క్‌ఫెడ్‌కు ప్రభుత్వ హామీ ప్రతిపాదనపై మంత్రివర్గం చర్చలు జరుపుతోంది. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల రేషనలైజేషన్‌ ప్రతిపాదనలపై మంత్రివర్గం మంతనాలు చేస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించిన అంశంపై చర్చిస్తోంది. ఫెర్రో అల్లాయ్స్‌ పరిశ్రమలకు ఎలక్ట్రిసిటీ డ్యూటీ టారిఫ్‌ తగ్గింపు తగ్గింపు ప్రతిపాదనపైనా మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చిస్తున్నారు. నాగావళి నదిపై గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజీపై కుడి, ఎడమవైపు మినీ హైడల్‌ ప్రాజెక్టుల నిర్మాణం ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు సమాచారం. వైఎస్సార్ జిల్లా C.K.దిన్నె మండలంలోని ఏపీ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ఇన్‌ఫ్రా కార్పొరేషన్‌కు కేటాయించిన 2 వేల 595 ఎకరాల బదిలీకి స్టాంప్‌ డ్యూటీ మినహాయింపు ప్రతిపాదనపై కేబినెట్ చర్చిస్తోంది. అభ్యంతరం లేని ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణ ప్రతిపాదనపైనా చర్చలు సాగుతున్నాయి.
Last Updated : Jan 17, 2025, 4:04 PM IST

ABOUT THE AUTHOR

...view details