తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : Jan 21, 2024, 10:25 PM IST

ETV Bharat / videos

అంగట్లో అమ్మకానికి అంగన్​వాడీ కోడి గుడ్లు - రూ.5కే అంటూ బోర్డు పెట్టుకుని మరీ విక్రయం

Anganwadi Eggs Selling in Shop : చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు ప్రభుత్వం అందించే అంగన్​వాడీ కోడి గుడ్లను ఓ వ్యక్తి అంగట్లో అమ్మకానికి పెట్టాడు. ఒక్క కోడి గుడ్డు రూ.5కే విక్రయిస్తూ గ్రామస్థులను బురిడీ కొట్టించాడు. ఈ సంచలన వైనం వికారాబాద్​ జిల్లా చౌడపూర్​ మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, పెంటయ్య అనే వ్యాపారి గత రెండు నెలల నుంచి కోడిగుడ్లు విక్రయిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇవాళ కోడిగుడ్లపై తెలంగాణ ముద్రను గమనించిన స్థానికులు, వీటిని ఎక్కడి నుంచి తెచ్చి అమ్ముతున్నావని వ్యాపారిని నిలదీశారు.

Anganwadi Eggs in Shop : దీంతో అంగన్​వాడీ కేంద్రంలో డ్రైవర్​గా పని చేస్తున్న వెంకటేశ్​ అనే వ్యక్తి తనకు ఈ కోడిగుడ్లను తక్కవ ధరకు అమ్ముతున్నట్లు వ్యాపారి తెలిపాడు. అంగన్​వాడీకి వెళ్లాల్సిన కోడి గుడ్లను కొందరు తప్పుదోవ పట్టించి అమ్ముకుంటున్నారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుని, మళ్లీ ఇలా జరగకుండా చూడాలని అధికారులను కోరారు.

ABOUT THE AUTHOR

...view details