LIVE : రెండో రోజు కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు - ప్రత్యక్షప్రసారం - AP Assembly Sessions 2024 - AP ASSEMBLY SESSIONS 2024
Published : Jun 22, 2024, 11:06 AM IST
|Updated : Jun 22, 2024, 1:39 PM IST
AP Assembly Sessions 2024 Day 2 Live : ఆంధ్రప్రదేశ్లో కొత్త శాసనసభ కొలువు తీరింది. పదహారో అసెంబ్లీ సమావేశాల తొలిరోజున 171 మంది సభ్యులతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్యచౌదరి ప్రమాణం చేయించారు. ఉదయం పదిన్నర గంటలకు సభ సమావేశంకాగానే తొలి రోజు మిగిలిపోయిన మరో ముగ్గురు ప్రమాణం నేడు ప్రమాణం చేశారు. తరువాత సభకు స్వల్ప విరామం ప్రకటించారు. ఉదయం 11 గంటలకు తిరిగి సభ ప్రారంభం అయ్యింది. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పీకర్ ఎన్నిక ప్రక్రియ చేపట్టారు. స్పీకర్ ఎన్నిక ప్రక్రియలో పాలుపంచుకోకుడదని వైఎస్సార్సీపీ నిర్ణయించుకుంది. స్పీకర్ పదవికి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నిక లాంఛనం కానుంది. ఈ విషయాన్ని ప్రొటెం స్పీకర్ ప్రకటించగానే అయన్న పాత్రుడును సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ శాసన సభా పక్ష నేతలు కలిసి స్పీకర్ స్థానంలో కూర్చోబెడతారు. రెండోరోజు శాసనసభ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం.
Last Updated : Jun 22, 2024, 1:39 PM IST