'జయ జయహే తెలంగాణ' గీతం ఆవిష్కరణ - పాట వింటూ కన్నీళ్లు పెట్టుకున్న అందెశ్రీ - ANDESHREE EMOTIONAL VIDEO - ANDESHREE EMOTIONAL VIDEO
Published : Jun 2, 2024, 2:08 PM IST
Andeshree Emotional On Telangana Song : పదేళ్ల నిరీక్షణ తర్వాత అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ పాట తెలంగాణ రాష్ట్ర గీతంగా పభుత్వం ఆమోద ముద్ర వేసింది. చాలా సంవత్సరాల తర్వాత ఆయన రాసిన పాటకు గుర్తింపు రావడంతో పరేడ్ గ్రౌండ్లో గీతం వింటూ అందెశ్రీ భావోద్వేగానికిగురై కన్నీళ్లు పెట్టుకున్నారు. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలని అంటూ వస్తున్న పాట వింటూ అందెశ్రీ కంట కన్నీటితో ఆలకిస్తూ భావోద్వేగం చెందారు. గీతాన్ని వింటున్నంత సేపు ఆయన కళ్లలో కన్నీరు ఆగలేదు.
Telangana State Anthem : తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర గీతం 'జయజయహే విడుదల చేశారు. హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. తొలుత జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర గీతాన్ని విడుదల చేశారు. ఈ గీతం వింటూ అందెశ్రీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అందెశ్రీ రాసిన 'జయ జయహే తెలంగాణ' గీతానికి కీరవాణి స్వరాలందించిన విషయం తెలిసిందే.