LIVE : నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో 'అలయ్ - బలయ్' కార్యక్రమం - ALAI BALAI LIVE
Published : Oct 13, 2024, 11:29 AM IST
|Updated : Oct 13, 2024, 3:12 PM IST
Alai Balai Program Live : ప్రతి ఏటా దసరా మరుసటి రోజు అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని వైభవంగా జరుపుతున్నారు. ఇందుకు నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం వేదిక అయింది. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయాలకు అతీతంగా నాయకులను ఒకే వేదిక మీదకు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో 2005లో అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేటికి ఈ కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్ర, కేంద్రమంత్రులు, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ రాజకీయాలకు అతీతంగా ఇతర పార్టీల నేతలు రాజకీయాలకు అతీతంగా పాల్గొననున్నారు. అలయ్ బలయ్ కి వచ్చే అతిథులకు ప్రత్యేకంగా తెలంగాణ వంటకాలను రుచి చూపించనున్నారు. మటన్, తలకాయ కూర, పాయ, బోటి, చికెన్, చేపల కూర, పచ్చి పులుసు, సర్వ పిండి వంటి అనేక తెలంగాణ వంటకాలను ఏర్పాటు చేశారు.
Last Updated : Oct 13, 2024, 3:12 PM IST