తెలంగాణ

telangana

ETV Bharat / videos

లా అండ్ ఆర్డర్ నగరంలో ఎక్కడ ఉందో చెప్పండి : అక్బరుద్దీన్‌ - Akbaruddin Owaisi On Law Order - AKBARUDDIN OWAISI ON LAW ORDER

By ETV Bharat Telangana Team

Published : Jul 29, 2024, 8:09 PM IST

Akbaruddin Owaisi On Law Order In Hyderabad : హైదరాబాద్‌లో శాంతి భద్రతలు పూర్తిస్థాయిలో క్షీణించాయని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ ఆరోపించారు. రోజురోజుకూ నేరాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ బడ్జెట్ చర్చల్లో భాగంగా అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ ప్రతి పోలీస్‌స్టేషన్‌కు మామూళ్లు వెళ్తున్నాయని ఆరోపించారు. ఓ ఏసీపీ స్థాయి అధికారి పోలీస్‌ స్టేషన్‌ నిర్మాణానికి నగదు సాయం చేయమని కోరారని దానికి తాను మీరు వసూలు చేస్తున్న మామూళ్లతో నిర్మించుకోవాలని సమాధానం ఇచ్చానని పేర్కొన్నారు.  

హైదరాబాద్‌లో చాలా చోట్ల లా అండ్ ఆర్డర్ సమస్యలు ఉన్నాయని తెలిపారు. మళ్లీ నగరంలో 3 హత్యలు చోటు చేసుకున్నాయని లా అండ్ ఆర్డర్ నగరంలో ఎక్కడ ఉందో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. టాస్క్ ఫోర్స్ పోలీసుల పని నేరస్థులను పట్టుకోవడమని కానీ వాళ్లు సామాన్యులపై లాఠీ ఛార్జ్ చేస్తున్నారని మండిపడ్డారు. రాత్రి స‌మ‌యాల్లో ఆస్ప‌త్రుల‌కు వెళ్తున్న వారిపై, ఐటీ ఉద్యోగులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేస్తున్నారన్నారు. సామాన్యులపై కాకుండా క్రిమినల్స్‌, గంజాయి తరలించేవారిని కొట్టాలని సూచించారు. 

ABOUT THE AUTHOR

...view details