స్కూటీపై స్పృహ తప్పి రోడ్డుపై పడిన వ్యక్తి - సీపీఆర్ చేసి ప్రాణాలను కాపాడిన యువకుడు - cardiopulmonary resuscitation - CARDIOPULMONARY RESUSCITATION
Published : Sep 11, 2024, 2:20 PM IST
CPR is life saving: స్కూటీపై సృహ తప్పి రోడ్డుపై పడిన వ్యక్తికి ఓ యువకుడు సీపీఆర్ చేయడంతో ప్రాణాపాయం తప్పిన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. అతని ప్రాణాలను కాపాడిన ఆ యువకుడిపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇదీ జరిగింది: సూర్యాపేట జిల్లా, చింతలపాలెం మండలం, దొండపాడులో గ్రామానికి చెందిన అన్నపురెడ్డి గోవిందారెడ్డి మండల కేంద్రంలో బ్యాంకు నుంచి స్కూటీపై ఇంటికి వెళుతుండగా సృహ తప్పి రోడ్డుపై పడిపోయాడు. అప్పుడు అటుగా వెళుతున్న భాగ్య రాజ్ అనే వ్యక్తి రోడ్డుపై పడి ఉన్న గోవిందా రెడ్డిని చూసి పైకి లేపే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ స్పృహ లేకపోవడం వలన అతను లేవలేకపోయాడు. అప్పుడు వెంటనే గోవిందా రెడ్డికి ఆ యువకుడు పది నిముషాలు పాటు సీపీఆర్ చేయగా సృహలోకి వచ్చారు. అనంతరం అతన్ని కోదాడ ఆసుపత్రికి తరలించారు. గోవిందారెడ్డి ప్రాణాలను కాపాడిన యువకుడిని కుటుంబం సభ్యులు, స్థానికులు అభినందించారు.