తెలంగాణ

telangana

ETV Bharat / videos

నాలుగు ప్రభుత్వ కొలువులు సాధించిన నిజామాబాద్​ యువతి - Bezzarapu Mounika

By ETV Bharat Telangana Team

Published : Feb 27, 2024, 7:38 PM IST

Women Got 4 Government Jobs In Nizamabad : బ్యూటిషియన్ కోర్సులో జాయిన్ అవుదాం అనుకున్న యువతి నేడు నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. ప్రభుత్వ ఉద్యోగానికి ఓ ట్రయల్ ఇద్దామని పోటీ పరీక్షలకు హాజరవటం మొదలు పెట్టి రాసిన ప్రతి పరీక్ష ఉద్యోగం రావడంతో ఇక వెను దిరిగి చూడలేదు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్​కు చెందిన బెజ్జారపు మౌనిక ఇటీవల టీఎస్పీఎస్సీ ప్రకటించిన డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి ఎంపికయింది. మొదట జూనియర్ పంచాయతీ సెక్రటరీగా ఎంపికై 6 నెలల పాటు ఉద్యోగం చేస్తున్న సమయంలోనే ఈఎస్ఐలో ఫార్మాసిస్ట్ ఉద్యోగానికి ఎంపికైంది. ఈఎస్ఐలో నాలుగున్నర ఏళ్లుగా ఉద్యోగం చేస్తుండగా ఇప్పుడు డ్రగ్ ఇన్​స్పెక్టర్ ఉద్యోగానికి ఎంపికైంది. టీఎస్పీఎస్సీ నిర్వహించిన ఫార్మాసిస్ట్ ఉద్యోగం వరించినా రిలీంక్విష్మెంట్ ఇచ్చి ఆ ఉద్యోగాన్ని వదులుకుంది. ఇలా మొత్తం నాలుగు ఉద్యోగాలు సాధించింది.

Bezzarapu Mounika : గ్రూప్ 4 పరీక్ష కూడా రాసి అందులో 1450 ర్యాంకు వచ్చినా సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్లక ఆ ఉద్యోగాన్ని కూడా వదులుకున్నట్లు ఇలా రాసిన ప్రతి ఉద్యోగం సాధించింది. భర్త, తల్లిదండ్రుల ప్రోత్సహంతోనే ఇదీ సాధ్యమైందని చెబుతోంది మౌనిక. మహిళలకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని ముందుకు కష్టపడితే ఫలితం తప్పక ఉంటుందని అంటున్న యువతి మౌనికతో చిట్ చాట్.

ABOUT THE AUTHOR

...view details