తెలంగాణ

telangana

ETV Bharat / videos

'బాహుబలి'లా ఆటోను అమాంతం ఎత్తిన చిన్నారి- అమ్మ కోసం డేరింగ్ అడ్వెంచర్​! వీడియో చూశారా? - Daughter Saved Mother Bravely - DAUGHTER SAVED MOTHER BRAVELY

By ETV Bharat Telugu Team

Published : Sep 9, 2024, 3:28 PM IST

Daughter Saved Mother Bravely : రోడ్డు దాటుతూ ప్రమాదవశాత్తు ఆటో కింద పడిన తన తల్లిని ఓ చిన్నారి రక్షించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. బాహుబలిలా తన తల్లిని రక్షించిన ఆ చిన్నారిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. 

ఇదీ జరిగింది
మంగళూరులోని రాజరత్నపురకు చెందిన చేతన(35) ట్యూషన్​కు వెళ్లిన తన కుమార్తెను ఇంటికి తెచ్చేందుకు వెళ్లారు. ఈ క్రమంలో రోడ్డు దాటుతుండగా, ఎదురుగా ఒక ఆటో వేగంగా వచ్చింది. ప్రమాదాన్ని తప్పించేందుకు ఆటో డ్రైవర్​ ప్రయత్నించారు. కానీ ఆటో అదుపు తప్పి పడిపోయింది. ఆటో కింద చేతన చిక్కుకున్నారు. దీనితో అక్కడే ఉన్న వైభవి ఏమాత్రం ఆలస్యం చేయకుండా, ఆటోను ఎత్తి, తల్లిని బయటకు తీసింది. వాస్తవానికి ఆటోలో డ్రైవరే కాకుండా, ఎంతో మంది ప్రయాణికులు కూడా ఉన్నారు. అయినా అంత బరువు ఉన్న ఆటోను వైభవి బాహుబలిలా పైకి ఎత్తి, తల్లిని రక్షించింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీంతో ఏడవ తరగతి చదువుతున్న ఆ చిన్నారి ధైర్యాన్ని, తెగువను అందరూ ప్రశసిస్తున్నారు.  
కాగా, ఆటో కింద పడడం వల్ల చేతనకు గాయాలు అయ్యాయి. ఆటోలో ఉన్నవాళ్లు కూడా గాయపడ్డారు. వీరందరినీ సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 

ABOUT THE AUTHOR

...view details