ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగాలను కల్పించాలి - 1998 డీఎస్సీ అభ్యర్థుల వినతి - DSC candidates Dharna - DSC CANDIDATES DHARNA
Published : Jun 9, 2024, 6:29 PM IST
DSC 1998 Candidates Protest : మానవతా దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ 1998 అభ్యర్థులకు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించాలని 98 డీఎస్సీ అభ్యర్థులు రాష్ట్ర ముఖ్యమంత్రికి విన్నవించారు. హైదరాబాద్ దోమలగూడలోని యుటీఎఫ్ కార్యాలయంలో 1998 డీఎస్సీ అభ్యర్థులు సమావేశమయ్యారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తాము విశ్వ ప్రయత్నాలు చేశామని 1998 డీఎస్సీ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు నర్సింహారెడ్డి తెలిపారు. రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రెండు పర్యాయాలు కలిసి తమ సమస్యను విన్నవించామని ఈ విషయంలో సీఎం సానుకూలంగా స్పందించినట్లు ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని గత ప్రభుత్వము 1998 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగం కల్పించిందని అదేవిధంగా తెలంగాణలో కూడా తమకు ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని ఆయన విన్నవించారు. ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన తాను డీఎస్సీ 98లో బాధితుడుగా తీవ్ర అన్యాయానికి గురైనట్లు లక్ష్మణరావు పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.