తెలంగాణ

telangana

ETV Bharat / videos

అందుకే ఫోన్​ మాట్లాడుతూ రోడ్డు దాటొద్దు అనేది - కారు ఢీకొని యువకుడి మృతి - వీడియో వైరల్ - Road Accident In Medchal District - ROAD ACCIDENT IN MEDCHAL DISTRICT

By ETV Bharat Telangana Team

Published : Jul 15, 2024, 11:04 AM IST

Updated : Jul 15, 2024, 11:44 AM IST

Don't Talk on Phone While Crossing the Road : ఓ వ్యక్తి ఫోన్​లో మాట్లాడుతూ రోడ్డు దాటుతున్నాడు. ఇంతలోనే ఓ కారు వేగంగా వచ్చి అతడిని చూసి బ్రేక్​ వేసినా లాభం లేకుండా పోయింది. ఈ క్రమంలో బలంగా ఆ యువకుడిని ఢీకొట్టడంతో ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన మేడ్చల్​ జిల్లా పోచారం ఐటీ కారిడార్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది. స్థానికులు బాధితుడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. చికిత్స పొందుతూ మృతి చెందాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వరంగల్​ జాతీయ రహదారి పరిధి అన్నోజీగూడ వద్ద రాజీవ్ గృహకల్ప కాలనీకి చెందిన గిరి అనే వ్యక్తి రోడ్డు దాటేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ సమయంలో అతడు ఫోన్​ మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలోనే ఉప్పల్​ వైపు నుంచి వస్తున్న కారు అతడిని బలంగా ఢీకొంది. దీంతో ఒక్కసారిగా ఆ వ్యక్తి ఎగిరి రోడ్డు పక్కకు పడిపోయాడు. తీవ్ర గాయాల పాలైన గిరిని గమనించిన స్థానికులు, గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో మృతి చెందినట్లుగా పోలీసులు ధ్రువీకరించారు. కాగా ఘటన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు వివరించారు.

Last Updated : Jul 15, 2024, 11:44 AM IST

ABOUT THE AUTHOR

...view details