తెలంగాణ

telangana

ETV Bharat / videos

చెరువులోకి డంపింగ్​ యార్డు కాలుష్య జలాలు - మృత్యువాతపడిన లక్షలాది చేపలు - Fish Dies toxic From dumpingyard

By ETV Bharat Telangana Team

Published : May 18, 2024, 1:40 PM IST

Lakhs Of Fish Dies Due To Toxic From Dumping Yard in Edulabad : ఇటీవల కురిసిన వర్షాలకు జవహర్​నగర్ డంపింగ్ యార్డు నుంచి కాలుష్య జలాలు చెరువులో చేరి దానిలోని చేపలన్నీ చనిపోయిన ఘటన మేడ్చల్ జిల్లా ఘట్​కేసర్ మండలంలోని ఎదులాబాద్ గ్రామ పంచాయతీలో చోటు చేసుకుంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జవహర్​నగర్ డంపింగ్ యార్డు నుంచి కాలుష్య జలాలు లక్ష్మి నారాయణ చెరువులోకి చేరి దానిలోని చేపలన్నీ మృత్యువాతపడ్డాయి. 2 నుంచి 3 కిలోలు ఎదిగి చేతికి వస్తున్నాయనుకునే సమయంలో చేపలన్నీ చనిపోవడంతో మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రతి సంవత్సరం చేప పిల్లలను చెరువులో వేసి, అవి పెద్దయ్యే సరికి ఇలానే జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చేపలు కాలుష్యం కారణంగా చనిపోవడం, దాంతో లక్షలాది రూపాయలు తాము నష్టోపోతున్నామని వాపోయారు. ప్రభుత్వానికి దీనిపై పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. చెరువుపై 700 కుంటుబాలు ఆధారపడి ఉన్నామని, న్యాయం చేయాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. 

ABOUT THE AUTHOR

...view details