ETV Bharat / bharat

నేచురల్​గా క్యాన్సర్​ నుంచి కోలుకున్నట్లు స్టేట్మెంట్​- రూ.850 కోట్లు కట్టాలంటూ మాజీ క్రికెటర్ భార్యకు నోటీసులు - CANCER CURE CLAIM PUNJAB

పంజాబ్ కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ నవజోత్​ సింగ్ సిద్ధూ భార్యకు నోటీసులు - రూ.850 కోట్లు కట్టాలన్న ఛత్తీస్​గఢ్​ సివిల్​ సొసైటీ - క్యాన్సర్​ నుంచి ఎలా కోలుకున్నారో వివరణ ఇవ్వాలంటూ నోటీసు

navjot singh siddhu, navjot kaur
navjot singh siddhu, navjot kaur (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 28, 2024, 2:53 PM IST

Cancer Cure Claim Punjab : పంజాబ్ కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ నవజోత్​​ సింగ్ సిద్ధూ భార్యను రూ.850 కోట్లు కట్టాలంటూ నోటీసులు జారీ చేసింది ఛత్తీస్​గఢ్​ సివిల్​ సొసైటీ. స్టేజ్-4 క్యాన్సర్​ నుంచి సహజమైన పద్ధతుల్లో తన భార్య కోలుకుందని ఇటీవల సిద్ధూ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ సొసైటీ నోటీసులు జారీ చేసింది. ఏడు రోజుల్లోపు అందుకు సంబంధించిన పత్రాలను సమర్పించాలని లేకుంటే కోర్టుకు వెళ్తామని తెలిపింది.

ఇదీ జరిగింది!
చాలా కాలంగా క్యాన్సర్​తో బాధపడుతున్న తన భార్య నవజోత్ సింగ్ కౌర్​ కోలుకున్నారని ఇటీవల తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిద్ధూ తెలిపారు. తన భార్య బతకడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయని వైద్యులు చెప్పారని, అయినా ఆహారపు అలవాట్లల్లో మార్పులు చేసుకుని, డైట్​ ఫాలో అవ్వడం వల్ల క్యాన్సర్​ను జయించదని ప్రెస్​ మీట్​లో పేర్కొన్నారు. అందుకు ఆమె తీసుకున్న డైట్​ ప్లాన్​ గురించి కూడా షేర్​ చేశారు.

ఆహారం తీసుకునేటప్పుడు గ్యాప్​ ఇస్తే క్యాన్సర్​ కణాలు వాటంతట అవే చనిపోతాయని సిద్ధూ అన్నారు. రాత్రి 7 గంటలకు భోజనం చేస్తే మళ్లీ ఉదయం 10 గంటలకు భోజనం చేయాలని తెలిపారు. నిమ్మ, వేప, తులసి వంటివి ఎక్కువగా ఉపయోగించాలని, వాటితో పాటు పసుపు, అల్లం, గుమ్మడికాయ రసం, బీట్​రూట్, క్యారెట్ జ్యూస్​లు వంటి రోజువారీ ఆహారంలో తీసుకోవాలని పేర్కొన్నారు. ఇలా 40 రోజుల్లో తన భార్య క్యాన్సర్​ను జయించినట్లు చెప్పారు.

దీనిపై అనేక విమర్శలు వస్తున్న వేళ ఛత్తీస్​గఢ్​ సివిల్ సొసైటీ కన్వీనర్ డా. కులదీప్​ సోలంకీ స్పందించి నోటీసులు జారీ చేశారు. మీ డైట్​ గురించి విని దేశ, విదేశాల్లో క్యాన్సర్​ రోగులు నుంచి అల్లోపతి వైద్యంపై వ్యతిరేకత వస్తుందని తెలిపారు. దీనిపై ఏడు రోజుల లోపు వివరణ ఇవ్వాలని, లేదా క్షమాపణలు తెలిజేయాలని అన్నారు. సరైన ఆధారాలు సమర్పించకుంటే కోర్టుకు వెళ్తమని ఎక్స్​ వేదికగా పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.