తెలంగాణ

telangana

ETV Bharat / videos

వామ్మో! ఒకే ఇంట్లో 150 నాగుపాములు- అంతా హడల్!! - 150 Cobra Snakes Video - 150 COBRA SNAKES VIDEO

By ETV Bharat Telugu Team

Published : Jul 12, 2024, 11:38 AM IST

150 Cobra Snakes Video : ఉత్తర్​ప్రదేశ్​లోని కుషీనగర్ జిల్లాలో​ ఒకే ఇంట్లో 150 పాములు కనిపించడం కలకలం రేపింది. గంగారాణి గ్రామానికి చెందిన ఫుల్బాదన్ ఇంట్లో ఈ పాములు బయటపడ్డాయి. దాదాపు 16 గంటలపాటు శ్రమించి సుశీల్ మిశ్రా అనే వ్యక్తి ఇంట్లో నుంచి పాములను సురక్షితంగా బయటకు తీశాడు. గంగారాణి గ్రామానికి చెందిన ఫుల్బాదన్ బుధవారం రాత్రి 8 గంటలకు నిద్రపోవడానికి తన మంచం వద్దకు వెళ్లాడు. అక్కడ పెద్ద పాము కనిపించింది. వెంటనే ప్రాణ భయంతో ఫుల్బాదన్ ఇంటి నుంచి బయటకు పరుగు తీశాడు. అప్పుడు గ్రామస్థులు ఫుల్బాదన్ ఇంటి వద్ద గుమిగూడారు. అయితే లోపలికి వెళ్లే పామును పట్టుకునే ధైర్యం ఎవరూ చేయలేదు. 

వెంటనే గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడకు వచ్చిన ఇద్దరు అధికారులు పాములను చూసి భయంతో వెనుదిరిగినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత గులేల్హాకు చెందిన సుశీల్ మిశ్రాకు ఫోన్ చేశారు గ్రామస్థులు. అప్పుడు సుశీల్ వచ్చి 16 గంటలపాటు శ్రమించి 150 పాములను వెలికితీశాడు. తాను రక్షించిన పాముల్లో ఒకటి మాత్రమే పెద్దదని, మిగతావన్ని పిల్లలని సుశీల్ మిశ్రా తెలిపాడు. రక్షించిన పాములను తనవెంట తీసుకెళ్లాడు సుశీల్ మిశ్రా. వాటిని వాల్మీకి నగర్ అడవిలో వదిలివేస్తానని చెప్పాడు. ఫుల్బాదన్ ఇంట్లో ఎలుకలు రంధ్రాలు చేశాయని, వాటినే సర్పాలు నివాసంగా మార్చుకున్నాయని పేర్కొన్నాడు.

ABOUT THE AUTHOR

...view details