తిమ్మాపురం స్కూల్లో - 11 మంది విద్యార్థులకు ఏడుగురు టీచర్స్ - Govt Schools Problems In warangal
Published : Aug 21, 2024, 1:52 PM IST
Govt Schools Problems In warangal : ఏడుగురు ఉపాధ్యాయులు కేవలం 11 మంది విద్యార్థులకు విద్యను బోధించడం ప్రస్తుతం చర్చనీయాశంగా మారింది. వరంగల్ జిల్లా సంగెం మండలం తిమ్మాపురం ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరిస్థితి ఇది. ఇందులో 9వ తర గతిలో ఐదుగురు, ఏడులో ముగ్గురు, ఆరులో ముగ్గురు ఉన్నారు. 8, 10 తరగతుల్లో అసలు పిల్లలే లేరు. నైపుణ్యాలు కలిగిన అధ్యాపకులు ఉన్నా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించేందుకు తల్లిదండ్రులు ముందుకు రావడం లేదు.
మధ్యాహ్న భోజనం, స్కూల్ యూనిఫామ్ సహా అధునాతన సౌకర్యాలు కల్పించినప్పటికీ ఆ పాఠశాలలో మాత్రం విద్యార్థులు కానరావడం లేదు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా విద్యనభ్యసించే వారి శాతం రోజురోజుకు పడిపోతోంది. జూన్, జులై మాసాల్లో బడిబాట కార్యక్రమం నిర్వహించినా విద్యార్థుల శాతం పెరగ లేదని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల్ని ఈ బడికి రప్పించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేదని వారు తెలిపారు. పాఠశాలలో విద్యార్థుల శాతం పెంచేందుకు ఉపాధ్యాయులు పడరాని పాట్లు పడ్డ ఫలితం లేకుండా పోయిన వరంగల్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల ధైన్య స్థితిపై ఈటీవీ తెలంగాణ ప్రత్యేక కథనం.