YouTube Big Update: ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్ తన వినియోగదారులకు గుడ్ న్యూస్ తెచ్చింది. కంటెంట్ క్రియేటర్స్ ఇకపై మూడు నిమిషాల పాటు అత్యధిక నిడివి గల షార్ట్స్‌ను అప్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. అక్టోబర్ 15 నుంచి ఈ సేవలు అందుబాటులో ఉంటాయిని వెల్లడించింది. గతంలో యూట్యూబ్ షార్ట్స్ వీడియోల గరిష్ఠ వ్యవధి 60 సెకన్లకు మాత్రమే ఉండేది. అయితే ప్రస్తుతం కంటెంట్‌ను క్రియేట్ చేసేందుకు తన యూజర్స్‌కు యూట్యూబ్ మరిన్ని మార్గాలను అందిస్తుంది.
"ఈ మార్పు అనేది యాస్పెక్ట్ రేషియోలో స్క్వేర్ లేదా లాంగ్ లెన్త్ వీడియోలకు మాత్రమే వర్తిస్తుంది. దీంతోపాటు అక్టోబర్ 15లోపు మీరు అప్లోడ్ చేసిన ఏ వీడియోలపై కూడా ఇది ఎటువంటి ప్రభావం చూపదు. రాబోయే నెలల్లో లాంగ్ షార్ట్స్ కోసం కావాల్సిన అంశాలను మెరుగుపరిచేందుకు మేము కృషి చేస్తాము." అని కంపెనీ ఒక బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది.
కంటెంట్ క్రియేటర్స్ తమ వీడియోలను దీర్ఘకాలంగా ఉంచేందుకు వారు 16:9 వంటి వైడెర్ ఏస్పెక్ట్ రేషియోలో వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు. అక్టోబర్ 15 కటాఫ్‌కు ముందు అప్లోడ్ చేసిన 60 సెకన్ల నుంచి 3 నిమిషాల మధ్య ఉన్న వెర్టికల్ వీడియోస్ కలిగి ఉన్న క్రియేటర్స్‌కు ఇవి రెగ్యులర్ లాంగ్ ఫామ్ కంటెంట్‌గా కన్పిస్తాయి.
అధిక నిడివి గల షార్ట్స్‌లో కాపీరైట్ ఉన్న ఆడియో అండ్ విజువల్స్ వినియోగంపై యూట్యూబ్తన పాలసీలను కూడా వివరించింది. కాపీరైట్ ఉన్న మెటీరియల్‌ని కలిగి ఉన్న 60 సెకన్లకు మించిన ఏదైనా షార్ట్ ఆటోమేటిక్‌గా బ్లాక్ అయిపోతుంది. అయితే ఇది కంటెంట్ క్రియేటర్ ఛానెల్‌పై ఎలాంటి ప్రభావం చూపకుండా దీన్ని అన్ప్లేయబుల్ చేసేస్తారు.