తెలంగాణ

telangana

ETV Bharat / technology

పిల్లల యూట్యూబ్ నియంత్రణ పేరెంట్స్ చేతిలో- సరికొత్త ఫీచర్ యాక్టివేట్ చేసుకోండిలా! - Youtube Teenage Safety Feature - YOUTUBE TEENAGE SAFETY FEATURE

Youtube New Feature For Teenage Safety: టీనేజ్ భద్రతను దృష్టిలో పెట్టుకుని యూట్యూబ్ సరికొత్త ఫీచర్​ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ సాయంతో ఇకపై పిల్లల యూట్యూబ్ కంట్రోల్ వారి పేరెంట్స్​ చేతిలో ఉండనుంది. ఈ సంద్భంగా అసలేంటీ ఫీచర్? దీనివల్ల లాభాలేంటి? దీన్ని యాక్టివేట్ చేసుకోవటం ఎలా? వంటి వివరాలు మీకోసం.

Youtube_New_Feature_For_Teenage_Safety
Youtube_New_Feature_For_Teenage_Safety (ETV Bharat)

By ETV Bharat Tech Team

Published : Sep 7, 2024, 2:25 PM IST

Youtube New Feature For Teenage Safety: ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్​ఫామ్ యూట్యూబ్ సరికొత్త ఫీచన్​ను అందుబాటులోకి తెచ్చింది. టీనేజ్​ భద్రతను దృష్టిలో పెట్టుకుని పిల్లల యూట్యూబ్‌ నియంత్రణ వారి పేరెంట్స్​కు అందించాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో 'యూట్యూబ్‌ ఫ్యామిలీ సెంటర్‌' పేరుతో ఈ సరికొత్త ఫీచర్​ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా పిల్లల యూట్యూబ్ నియంత్రణ ఇకపై వారి తల్లిదండ్రుల చేతిలో ఉండనుంది. ఈ నేపథ్యంలో యూట్యూబ్ తీసుకొచ్చిన ఈ సరికొత్త ఫీచర్ పూర్తి వివరాలు మీకోసం.

యూట్యూబ్ సరికొత్త ఫీచర్​తో ప్రయోజనాలు?:

  • ఈ యూట్యూబ్‌ ఫ్యామిలీ సెంటర్‌ ఫీచర్ సాయంతో పిల్లల యూట్యూబ్‌ ఖాతాను తల్లిదండ్రుల అకౌంట్‌కు లింక్‌ చేయొచ్చు.
  • అంటే అకౌంట్‌ వినియోగించేది పిల్లలైనప్పటికీ దాని పూర్తి సమాచారం పేరెంట్స్‌ దగ్గర ఉంటుందన్నమాట.
  • ఈ సరికొత్త ఫీచర్‌తో వీడియో స్ట్రీమింగ్‌ వేదికలో అప్లోడ్ చేసే వీడియోలు, సబ్‌స్క్రైబ్‌ చేసే ఛానల్స్, పోస్టులు, కామెంట్స్ ఇలా పిల్లలు చేసే ప్రతీ విషయం తల్లిదండ్రులకు వెంటనే తెలిసిపోతుంది.
  • ఏదైనా వీడియో అప్లోడ్‌ చేసినా, లైవ్‌ స్ట్రీమ్‌ మొదలుపెట్టినా వెంటనే పేరెంట్స్‌కు E- Mail ద్వారా నోటిఫికేషన్‌ అందుతుంది.
  • అంటే తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే పిల్లల అకౌంట్‌ ఉంటుంది.
  • యూట్యూబ్‌ చిన్నపిల్లల కోసం ఇప్పటికే అనేక నిబంధనల్ని తీసుకొచ్చింది.
  • తాజాగా టీనేజర్ల కోసం ఈ తరహా సదుపాయం ప్రారంభించింది.
  • యువత భద్రతను దృష్టిలో పెట్టుకుని యూట్యూబ్‌ ఇప్పటికే అనేక నిబంధనల్ని తీసుకొచ్చింది.
  • ఇందులో భాగంగా పదేపదే వీక్షించడం హానికరం అని భావించే వీడియోలను రికమెండ్‌ చేయడాన్ని యూట్యూబ్ నిలిపివేసింది.
  • అయితే అదే సమయంలో పిల్లల సృజనాత్మకత, స్వతంత్రతను అణిచివేయకుండా ఉంటూనే వారికి రక్షణ కల్పించేందుకు ఈ సదుపాయాల్ని ప్రవేశపెట్టినట్లు చెప్పుకొచ్చింది.

ఈ ఫీచర్​ను యాక్టివేట్ చేసుకోవటం ఎలా?:

  • పేరెంట్స్‌ తమ యూట్యూబ్‌ యాప్‌లో సెట్టింగ్స్‌లోకి వెళ్లి Family Centre pageను సెలెక్ట్ చేసుకుని ఈ ఫీచర్‌ యాక్టివేట్‌ చేసుకోవచ్చు.
  • ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ యూజర్లు ఈ సేవలు వినియోగించుకోవచ్చు.
  • ఫ్యామిలీ సెంటర్‌ హబ్‌లో భాగంగా తీసుకొచ్చిన ఈ ఫీచర్‌ను త్వరలోనే విస్తృతం చేయనున్నట్లు యూట్యూబ్‌ ప్రకటించింది.

ఎయిర్‌టెల్ కస్టమర్లకు ఫెస్టివల్ ఆఫర్- ఆ ప్లాన్లపై అదనపు డేటా, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ - Airtel Festival Offers

జియో కస్టమర్లకు అదిరే గుడ్​న్యూస్- ఆ రీఛార్జ్​ ప్లాన్లపై భారీ ఆఫర్స్! - JIO Anniversary Offers

ABOUT THE AUTHOR

...view details