Payment Feature In X Twitter : బిలియనీర్ ఎలాన్ మస్క్ ఎక్స్ (ట్విట్టర్)ను సొంతం చేసుకున్న తర్వాత ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. ఒకప్పుడు సమాచారాన్ని షేర్ చేసుకునేందుకు మాత్రమే వినియోగించిన యాప్‌ను ఇప్పుుడు ఆల్-ఇన్-వన్ ప్లాట్‌ఫామ్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఈజీగా కనిపిస్తోంది. అందులో భాగంగా త్వరలో మరో ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆ ఫీచర్‌కు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
ట్విట్టర్‌ను ఎక్స్‌గా మార్చాక సూపర్ యాప్‌గా తీర్చిదిద్దుతానని అధినేత ఎలాన్ మస్క్ ఇప్పటికే అనేక సందర్భాల్లో తెలిపారు. చెప్పినట్లే ఎక్స్‌లో ఆడియో, వీడియో కాల్స్ సదుపాయం తీసుకొచ్చారు. మరిన్ని ఫీచర్లు పరిచయం చేసేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా పేమెంట్స్ జరిపే సదుపాయాన్ని తీసుకురావాలని చూస్తున్నారు. అందుకు సంబంధించి వెబ్ డెవలపర్ నిమా అవుజి (Nima Owji) పోస్ట్ పెట్టారు. ఎక్స్‌లో కొత్త ఫీచర్లకు సంబంధించి స్క్రీన్ షాట్‌ను షేర్ చేశారు. త్వరలోనే పేమెంట్స్ ఆప్షన్ రానుందని తెలిపారు. ట్రానాక్షన్స్ జరపడమే కాకుండా, బ్యాలెన్స్ కూడా తెలుసుకోవచ్చని చెప్పారు. పేమెంట్స్ హిస్టరీ కూడా కనిపిస్తుందని పేర్కొన్నారు. అయితే ఈ ఫీచర్ వాలెట్లాగా ఉంటుందా? లేక బ్యాంక్ అకౌంట్‌కు లింక్ చేయవచ్చా? అనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు.
ప్రీమియం సేవలు ఉచితం
కొన్నిరోజుల క్రితం, 2500కు పైగా వెరిఫైడ్ ఫాలోవర్లు ఉన్న ఖాతాలకు ప్రీమియం సేవల్ని ఉచితంగా అందివ్వనున్నట్లు ఎలాన్ మస్క్ తెలిపారు. 5 వేల మందికిపైగా ఫాలోవర్లు ఉన్న ఎక్స్ యూజర్లకు ప్రీమియం ప్లస్ సర్వీసులు ఫ్రీగా యాక్సెస్ చేసే సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. కంటెంట్ క్రియేటర్లకు, ఇన్‌ఫ్లుయెన్సర్లు మెరుగైన ఫీచర్లు అందించాలనే ఉద్దేశంతో ఈ సదుపాయం తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.