X Gives Free Blue Check To Big Follower Account Again : అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌కు సంబంధించిన ఎక్స్ (ట్విట్టర్) ప్లాట్‌ఫామ్ కొంత మంది యూజర్లకు పూర్తి ఉచితంగా కాంప్లిమెంటరీ 'బ్లూ టిక్'లను అందిస్తోంది. దీనితో చాలా మంది కన్ఫ్యూజన్ అవుతున్నారు. ఎందుకంటే, ఎలాన్ మస్క్ 2022లో ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తరువాత, యూజర్ల నుంచి నెలకు 8 డాలర్లు చొప్పున వసూలు చేసి, బ్లూ టిక్‌లను ఇవ్వడం మొదలు పెట్టారు.
బ్లూ టిక్ స్పెషాలిటీ!
ఎక్కువ మంది ఫాలోవర్లను సంపాదించిన వారికి ట్విటర్ వెరిఫికేషన్ బ్యాడ్జ్ కింద బ్లూ టిక్‌లను ఇచ్చేంది. ఇది పూర్తి ఉచితంగా అందించేది. దీనితో సెలబ్రిటీలు, ఇన్ప్లూయెన్సర్స్లు, పొలిటీషియన్ల అకౌంట్లకు బ్లూటిక్ మార్కులు ఉండేవి. కనుక యూజర్లు నిజమైన అకౌంట్లను ఫాలో కావడానికి వీలయ్యేది. కానీ 2022లో ఎలాన్ మస్క్ 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్‌ను కొనుగోలు చేశారు. తరువాత ఫ్రీగా బ్లూ టిక్స్ ఇవ్వడం మానేశారు. బ్లూ టిక్ కావాలని అనుకునేవాళ్లు నెలకు స్టార్టింగ్ ఫీజుగా 8 డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
దీనితో పలువురు సెలబ్రిటీల, హై-ప్రొఫైల్ అకౌంట్లకు ఉన్న బ్లూటిక్‌లు పోయాయి. ఇదే అవకాశంగా చాలా ఫేక్ ఎక్స్ అకౌంట్లు పుట్టుకొచ్చాయి. ఈ ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసిన వాళ్లు డబ్బులు చెల్లించి బ్లూ టిక్ కొనుకున్నారు. దీనితో అసలు, నకిలీ ఖాతాల మధ్య తేడా గుర్తించలేక యూజర్లు చాలా తికమకపడడం మొదలైంది.