తెలంగాణ

telangana

ETV Bharat / technology

మీ వాట్సాప్ అకౌంట్ హ్యాక్​ కాకూడదా? ఈ 3 తప్పులు అస్సలు చేయకండి! - Why Your WhatsApp Gets Hacked - WHY YOUR WHATSAPP GETS HACKED

Why Your WhatsApp Gets Hacked : టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా మన జీవితంలో ఒక భాగమైపోయిన వాట్సాప్ లాంటి వాటిని సులువుగా హ్యాక్ చేయగలుగుతున్నారు. అందుకే ఈ ఆర్టికల్​లో వాట్సాప్ ఎందుకు హ్యాక్ అవుతుంది? అలా జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.

WhatsApp
WhatsApp (ANI)

By ETV Bharat Telugu Team

Published : Aug 25, 2024, 2:34 PM IST

Why Your WhatsApp Gets Hacked :వాట్సాప్​ మన నిత్య జీవితంలో ఒక భాగం అయిపోయింది. సులువుగా, త్వరగా మెసేజ్​లు పంపడానికి, స్వీకరించడానికి వీలుగా ఉండడమే ఇందుకు కారణం. వాట్సాప్​లో ఎండ్​-టు-ఎండ్ ఎన్​క్రిప్షన్ ఉంటుంది. కనుక మీ మెసేజ్​లు, ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు సురక్షితంగా ఉంటాయని వాట్సాప్​ చెబుతోంది. ఇది కొంత వరకు వాస్తవమే. అయినప్పటికీ కొన్ని సార్లు మన వాట్సాప్ అకౌంట్లు హ్యాక్ అయిపోతూ ఉంటాయి. దీనికి ప్రధాన కారణం మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే. అవేంటో ఇప్పుడు చూద్దాం.

  1. టూ-స్టెప్​ వెరిఫికేషన్ ఎనేబుల్ చేసుకోవాలి​ :మీ వాట్సాప్ అకౌంట్సురక్షితంగా ఉండాలంటే దానికి 'పిన్'​ సెట్ చేసుకోవడం చాలా మంచిది. దీనితోపాటు టూ-స్టెప్ వెరిఫికేషన్ కూడా ఎనేబుల్ చేసుకోవాలి. దీని వల్ల మీ వాట్సాప్​ ఖాతాకు అదనపు రక్షణ ఏర్పడుతుంది. అయితే ఈ పిన్​ను, టూ-స్టెప్ వెరిఫికేషన్​​ కోసం వచ్చే ఓటీపీని ఎవరికీ, ఎట్టిపరిస్థితుల్లోనూ చెప్పకూడదు. ఒక వేళ ఇవి వేరేవాళ్లకు తెలిస్తే, మీ వాట్సాప్​ అకౌంట్ హ్యాక్​ అయ్యే ప్రమాదం ఉంటుంది.
  2. రిజిస్ట్రేషన్ కోడ్ షేర్ చేయకూడదు :అప్పుడప్పుడు మనం ఇతరుల ల్యాప్​టాప్​, డెస్క్​టాప్​ల్లో వాట్సాప్​ను వాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలా కొత్త డివైజ్​ల్లో మీరు వాట్సాప్ వాడినప్పుడు, మీ మొబైల్ నంబర్​కు ఒక రిజిస్ట్రేషన్ కోడ్ వస్తుంది. దీనిని మీరు చాలా సీక్రెట్​గా ఉంచాలి. ఒకవేళ ఈ రిజిస్ట్రేషన్ కోడ్ ఇతరుల చేతికి చిక్కితే, వాళ్ల చేతిలోకి మీ వాట్సాప్ అకౌంట్ వెళ్లిపోతుంది. కనుక వాళ్లు మీ ప్రమేయం లేకుండా మీ ఖాతా నుంచి మెసేజ్​లు పంపడానికి, స్వీకరించడానికి వీలవుతుంది. అంతేకాదు మీ విలువైన డేటాను తస్కరించడానికి, దానిని దుర్వినియోగం​ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది.
  3. అనుమానాస్పద లింక్​లపై క్లిక్ చేయకూడదు :హ్యాకర్లు మీ వాట్సాప్​నకు, ఈ-మెయిల్స్​కు​ ఫిషింగ్ లింక్స్​ పంపిస్తూ ఉంటారు. వీటిని పొరపాటున కూడా క్లిక్ చేయకూడదు. ఒకవేళ వీటిపై క్లిక్ చేస్తే, మీ డివైజ్ మొత్తం వారి కంట్రోల్​లోకి వెళ్లిపోతుంది. దీనితోపాటు మీ వాట్సాప్ కూడా హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కనుక వాట్సాప్​ వాడేటప్పుడు అన్ని సెక్యూరిటీ మెజర్స్​ తీసుకోవాలి. అప్పుడే మీ వాట్సాప్​ అకౌంట్​ సురక్షితంగా ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details