WhatsApp Stop Working:మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా? అయితే మీకో అలెర్ట్. మరికొన్ని రోజుల్లో కొన్ని ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో వాట్సాప్ పనిచేయదు. ఈ మేరకు ఆయా మొబైల్స్‌లో తమ సేవలను నిలిపివేయనున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. ఇంతకీ కంపెనీ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది? ఇకపై ఏ ఏ మొబైల్స్‌లో వాట్సాప్ పనిచేయదు? వంటి వివరాలు మీకోసం.
కారణం ఇదే!:సాధారణంగా వాట్సాప్కొత్త కొత్త ఫీచర్లను అందించడంతో పాటు యూజర్ భద్రత విషయంలో కూడా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఉంటుంది. యాప్‌లో బగ్స్ ఉంటే సరిచేయడంతో పాటు లేటెస్ట్ టెక్నాలజీకి సపోర్ట్ చేయని పాత ఫోన్లలో తన సేవలను నిలిపివేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని మొబైల్స్‌లో వాట్సాప్ సేవలు ఇక అందుబాటులో ఉండవు. ఇప్పటికీ యూజర్లు వాటిని వాడుతుంటే మాత్రం కొత్త ఫోన్లకు అప్‌గ్రేడ్ అవ్వాల్సి ఉంటుంది.
ఏ మొబైల్స్‌లో వాట్సాప్ పనిచేయదంటే?:ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఓఎస్‌తో పనిచేస్తున్న ఫోన్లలో వాట్సాప్ తన సేవలను నిలిపివేయనుంది. ఇది దాదాపు 9-10 ఏళ్ల క్రితం తీసుకొచ్చిన ఆపరేటింగ్ సిస్టమ్. దీనికి ఇప్పటి వరకూ ఎలాంటి అప్డేట్స్ లేవు. ప్రస్తుతం వాట్సాప్ వేదికగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న వేళ పాత ఫోన్లలో వాట్సాప్వాడటం అంత సేఫ్ కాదు. ఈ నేపథ్యంలోనే ఈ పాత ఓఎస్‌తో పనిచేస్తున్న మొబైల్స్‌లో జనవరి 1 నుంచి తన సేవలను నిలిపి వేయాలని వాట్సాప్ నిర్ణయించింది.
ఐఫోన్లలో కూడా..!:ఆండ్రాయిడ్ మొబైల్స్‌తో పాటు ఆయా ఐఫోన్లకూ వాట్సాప్ తన సపోర్ట్ నిలిపివేయనుంది. ఐఓఎస్ 15.1, అంతకంటే పాత వెర్షన్లు వాడుతున్న ఐఫోన్లలో తన సేవలను నిలిపివేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఒకవేళ ఎవరైనా ఇప్పటికీ పాత 'ఐఫోన్ 5s', 'ఐఫోన్ 6', 'ఐఫోన్ 6 ప్లస్' ఫోన్లను వాడుతుంటే వారు కూడా కొత్త ఫోన్లకు అప్‌గ్రేడ్ అవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం ఐఫోన్ యూజర్లకు కంపెనీ వచ్చే ఏడాది మే 5వ తేదీ వరకు గడువు ఇచ్చింది.