Whatsapp Theme Chat Feature: వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ తన ప్లాట్‌ఫామ్‌ను ఆల్-ఇన్-వన్‌గా రూపుదిద్దేందుకు ప్రయత్నిస్తోంది. ఆ దిశగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు జోడిస్తోంది. ఇప్పటికే యూజర్ల భద్రతను దృష్టిలో ఉంచుకొని అనేక ఫీచర్లను తీసుకొచ్చింది. వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని అందించేందుకు సరికొత్త సదుపాయాల్ని అందుబాటులోకి తెచ్చే పనిలో పడింది. ఈ క్రమంలోనే ఇటీవల కమ్యూనికేషన్‌ను మరింత సులభతరం చేసేందుకు వాయిస్ నోట్ ట్రాన్స్క్రిప్ట్స్ అనే ఫీచర్‌ను తీసుకొచ్చింది. తాజాగా మరో థీమ్ చాట్ అనే సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ సందర్బంగా ఏంటీ చాట్ థీమ్ ఫీచర్? ఇది ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? అనే వివరాలు మీకోసం.
ఏంటీ వాట్సాప్ చాట్ థీమ్ ఫీచర్?:
- వాట్సప్ కొత్త ఫీచర్ సాయంతో యూజర్లు అనేక రకాల థీమ్‌లను తమ చాట్‌కు జోడించొచ్చు.
- వాటికి నచ్చిన రంగులతో నింపొచ్చు.
- అంటే ఇకపై వినియోగదారులకు నచ్చిన విధంగా చాట్‌పేజ్ రూపొందిచ్చుకోవచ్చన్నమాట.
- యూజర్ల అనుభవాన్ని మెరుగపరచడమే కాకుండా చాటింగ్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు వాట్సాప్ ఈ సదుపాయాన్ని తీసుకురానుంది.
ఈ ఫీచర్ అందుబాటులోకి ఎప్పుడు?:
- ప్రస్తుతం ఈ సరికొత్త థీమ్ చాట్ ఫీచర్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది.
- ఈ మేరకు మెసేజింగ్ యాప్ వాట్సప్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ అందించే వాబీటా ఇన్ఫో తన బ్లాగ్‌లో పంచుకుంది.
- త్వరలోనే బీటా యూజర్లకు అందుబాటులోకి రానుందని తెలిపింది.
- సంబంధిత స్క్రీన్‌షాట్‌ను కూడా పంచుకుంది.