తెలంగాణ

telangana

ETV Bharat / technology

షేర్​ 'లవ్' ఆన్ స్టేటస్- వాట్సాప్​లో ఈ క్రేజీ ఫీచర్ గమనించారా? - WHATSAPP NEW MENTION FEATURE

వాట్సాప్​లో సరికొత్త ఫీచర్- ఇకపై స్టేటస్​లో మెన్షన్స్

Whatsapp Introduces New Feature
Whatsapp Introduces New Feature (ANI)

By ETV Bharat Tech Team

Published : Nov 3, 2024, 12:35 PM IST

Updated : Nov 3, 2024, 12:44 PM IST

Whatsapp Introduces New Feature:మార్కెట్లో ఎన్నో రకాల మెసేజింగ్ యాప్స్​ ఉన్నా వాట్సాప్​ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఈ యాప్ తన యూజర్స్​కు థ్రిల్లింగ్ ఎక్స్​పీరియన్స్​ ఇచ్చేందుకు ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకురావటమే ఇందుకు కారణంగా చెప్పొచ్చు. వ్యక్తిగత ప్రైవసీకి పెద్దపీట వేస్తూనే సరికొత్త అప్డేడ్స్ ఇస్తూ ఈ యాప్ తన క్రేజ్​ను మరింత పెంచుకుంటోంది. ఈ క్రమంలో వాట్సాప్ తాజాగా మరో క్రేజీ ఫీచర్​ తీసుకొచ్చింది. ఈ ఫీచర్ వినియోగదారులకు ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ అసలేంటీ ఫీచర్? దీన్ని ఎలా ఉపయోగించాలి? వంటి వివరాలు మీకోసం.

గత కొంతకాలంగా​ వాట్సాప్​ 'మెన్షన్​' అనే కొత్త ఫీచర్​ను తీసుకొస్తుందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. దీని ద్వారా ఇన్​స్టాగ్రామ్ తరహాలో స్టోరీ అప్​లోడ్ చేసే సమయంలో నచ్చిన వ్యక్తులకు ట్యాగ్ చేసుకునే అవకాశం ఉండటంతో యూజర్లు ఈ ఫీచర్ ఎప్పుడెప్పుడు అందుబాటులోకి వస్తుందా అని ఎదురుచూశారు. అయితే ఎట్టకేలకూ వాట్సాప్ ఈ ఫీచర్​ను తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇన్నాళ్లూ ఇన్​స్టాలో మాత్రమే ఉన్న ఈ ఫీచర్​ ఇప్పుడు వాట్సాప్​లోనూ అందుబాటులోకి రావడంతో యూజర్స్ ఎగిరి గంతేస్తున్నారనే చెప్పొచ్చు.

ఈ ఫీచర్​ ఉపయోగాలేంటి?:సాధారణంగా ఇన్‌స్టాగ్రామ్​లో మనం స్టోరీ అప్​లోడ్ చేసేటప్పుడు మెన్షన్ అనే ఫీచర్ వాడుతూ ఉంటాం. నచ్చిన వ్యక్తులను '@' సాయంతో ట్యాగ్‌ చేస్తుంటాం. అలా ట్యాగ్ చేసిన వ్యక్తులకు మనం స్టోరీ పెట్టినట్లు నోటిఫికేషన్ అందుతుంది. దీంతో వాళ్లు మన స్టోరీని చూస్తారు. ఇప్పుడు అచ్చం అలాంటి సదుపాయాన్నే వాట్సాప్ కూడా తన యూజర్స్​కు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఇకపై వాట్సాప్​లో స్టేటస్ పెట్టే సమయంలో కాంటాక్ట్‌లో నచ్చిన వ్యక్తులను ట్యాగ్‌ చేసుకోవచ్చు.

దీన్ని ఎలా వాడాలంటే?:

Whatsapp New Mention Feature (Whatsapp Blog)
  • వాట్సాప్​లో స్టేటస్ అప్​లోడ్ చేసే సమయంలో యాడ్ క్యాప్షన్స్ అనే బార్ కన్పిస్తుంది.
  • దానికి కుడివైపున ఇకపై '@' అనే ఐకాన్ దర్శనమిస్తుంది.
  • దీనిపై క్లిక్ చేయగానే మీ వాట్సాప్​లోని కాంటాక్ట్స్ అన్నీ కన్పిస్తాయి.
  • వాటిలో మీకు నచ్చిన వ్యక్తులను సెలెక్ట్ చేసుకుని మెన్షన్ చేయొచ్చు.
  • అలా స్టేటస్‌ అప్‌డేట్‌లో మెన్షన్‌ చేసినవారికి స్టేటస్‌కు సంబంధించిన నోటిఫికేషన్ అందుతుంది.
  • అయితే ఇన్​స్టా తరహాలో ట్యాగ్​ చేసిన వ్యక్తి పేరు మాత్రం అందరికీ కన్పించదని వాట్సాప్ తెలిపింది.
  • యూజర్ల వ్యక్తిగత ప్రైవసీ దెబ్బతినకూడదనే ఉద్దేశంతో వాట్సాప్ ఈ జాగ్రత్తలు తీసుకుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ దాదాపు వినియోగదారులందరికీ అందుబాటులోకి వచ్చింది.

ఒబెన్ ఎలక్ట్రిక్ నుంచి మరో కొత్త బైక్- టీజర్ చూశారా?

పవర్​ఫుల్ M4 సిరీస్​ చిప్​సెట్​తో యాపిల్ మ్యాక్​బుక్​ ప్రో- ధర ఎంతంటే?

Last Updated : Nov 3, 2024, 12:44 PM IST

ABOUT THE AUTHOR

...view details