Whatsapp Voice Message Transcripts:ప్రస్తుతం ప్రముఖ ఇన్స్టంట్ మెసెజింగ్ యాప్ వాట్సాప్ మన నిత్య జీవితంలో ఒక భాగం అయిపోయింది. వాట్సాప్ లేని స్మార్ట్ఫోనే లేదంటే అతిశయోక్తి కాదు. దీనికి కారణం ఇది ఈజీగా, స్పీడ్‌గా మెసేజెస్ పంపించేదుకు, స్వీకరించడానికి వీలుగా ఉండటమే. అంతేకాక వాట్సాప్ ఎప్పటికప్పుడు తన యూజర్ల కోసం కొంగొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురావడం కూడా మరో కారణంగా చెప్పొచ్చు.
ఈ క్రమంలో తాజాగా తన యూజర్లను ఆకట్టుకునేందుకు వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. సాధారణంగా మనకి ఎవరైనా వాట్సాప్‌లో మెసేజెస్ పంపిస్తే వాటిని ఓపెన్ చేయడంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. నలుగురిలో ఉన్నప్పుడు వాటిని ఓపెన్ చేయడం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. దీంతో ఈ సమస్యపైవాట్సాప్ ఫోకస్ చేసింది. ఈ క్రమంలో 'వాయిస్ మెసెజ్ ట్రాన్స్‌స్క్రిప్ట్' పేరుతో ఇంట్రస్టింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చింది.
వాట్సాప్ తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ సాయంతో వినియోగదారులు ఇకపై వాయిస్ మెసెజ్‌లను టెక్స్ట్ రూపంలో మార్చుకుని చదువుకోవచ్చు. అలాగని ఇది ట్రాన్స్‌లేటర్ కాదు. కేవలం ఏ భాషలో ఉంటుందో ఆ లాంగ్వేజ్‌కు అక్షర రూపాన్ని మాత్రమే ఇస్తుంది. అయితే కేవలం మెసెజ్ అందుకున్న వ్యక్తి మాత్రమే ఈ టెక్ట్స్‌ను చూడగలరని, పంపించిన వారు దీన్ని వినియోగించలేరని వాట్సాప్ పేర్కొంది.