Why Does Smartphone Have A Small Hole? :నేటి టెక్నాలజీ యుగంలో స్మార్ట్‌ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగింది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ స్మార్ట్ఫోన్లు యూజ్ చేస్తున్నారు. అయితే, స్మార్ట్‌ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరికి అందులో ఉన్న అన్ని రకాల ఫీచర్ల గురించి తెలిసి ఉండకపోవచ్చు. కొంతమంది కమ్యూనికేషన్ కోసం మాత్రమే వాడితే.. మరికొందరు మొబైల్‌తోనే పనులన్నీ చక్కబెట్టేస్తుంటారు.
అలాకాకుండా.. ఎప్పుడైనా మీ స్మార్ట్‌ఫోన్‌లో(Smartphone) వెనుక వైపు కెమెరాల మధ్యలో, ఫ్లాష్ లైట్ పక్కన, ముందు సెల్ఫీ కెమెరా పక్కన లేదా ఫోన్ పై వైపు ఫ్రేమ్‌లో, కింద ఛార్జింగ్ పోర్ట్ పక్కన "చిన్నపాటి రంధ్రం" ఉండటం గమనించారా? ఆ రంధ్రం ఎందుకు ఉంటుందని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? లేదా? అయితే, అసలు.. ఇంతకీ ఆ రంధ్రం ఎందుకు? దాంతో యూజర్‌కు ఉపయోగం ఏంటి? దాని గురించి టెక్ నిపుణులు ఏం చెబుతున్నారు? అనే పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మార్కెట్లోకి స్మార్ట్ఫోన్లు విడుదలైన కొత్తలో చాలా మంది ఫోన్ మాట్లాడుతుంటే మధ్యలో ఒక రకమైన శబ్దం వినిపిస్తుందని.. దాని కారణంగా అవతలి వారు మాట్లాడే మాట స్పష్టంగా వినిపించడం లేదని చెప్పేవారట. అదే.. నాయిస్ డిస్ట్రబెన్స్. తర్వాతి కాలంలో ఆ సమస్య రాకుండా స్మార్టఫోన్స్లో సరికొత్త ఫీచర్‌ని రూపొందించాయి మొబైల్ కంపెనీలు. అలా నాయిస్ డిస్ట్రబెన్స్ రాకుండా ఉండడానికి స్మార్ట్‌ఫోన్‌లో ఏర్పాటు చేసిన ఆ ఫీచరే.. ఈ చిన్న రంధ్రం. అవును.. ఆ రంధ్రంలో మినీ మైక్రోఫోన్ ఉంటుంది.