Vodafone Idea Launched Rs 209 Plan:పండగ వేళ వొడాఫోన్ ఐడియా సైలెంట్‌గా 209 రూపాయలతో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. అయితే వీఐ (వొడాఫోన్-ఐడియా) వినియోగదారులకు ఇప్పటికే రూ.199 రీఛార్జ్ ప్లాన్ ఆప్షన్ అందుబాటులో ఉంది. తాజాగా కంపెనీ ఈ ప్లాన్ కంటే రూ.10 ఎక్కువ ధరతో సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది. ఈ సందర్భంగా కేవలం 10 రూపాయల తేడాతో ఉన్న ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌ల మధ్య తేడా ఏంటో తెలుసుకుందాం రండి.
వొడాఫోన్-ఐడియా కొత్త ప్లాన్:వొడాఫోన్-ఐడియా ఈ కొత్త రూ. 209 ప్లాన్‌లో వినియోగదారులకు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ లభిస్తుంది. ఇది కాకుండా ఈ ప్లాన్‌తో మొత్తం 2GB ఇంటర్నెట్ డేటా, 300 SMSలు అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు.
అదే సమయంలో వొడాఫోన్-ఐడియా రూ. 199 ప్లాన్‌లో కూడా అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 2GB డేటాతో పాటు రోజుకు 300 SMSలను అందిస్తుంది. దీని వ్యాలిడిటీ కూడా 28 రోజులు.
అయితే ఈ రెండు ప్లాన్లూ ఒకే విధమైన బెనిఫిట్స్‌ను అందిస్తున్నాయి కదా, మరి రూ.10 ఎక్కువ ధరతో కంపెనీ ఎందుకు ఈ కొత్త ప్లాన్ తీసుకొచ్చిందనే అనే అనుమానం అందరిలో తలెత్తుతుంది. ఈ నేపథ్యంలో వీఐ రూ.199, రూ.209 ప్లాన్‌ల మధ్య తేడా ఏంటి? వీఐ కొత్తగా తీసుకొచ్చిన ప్లాన్‌లో అదనంగా ఏం అందిస్తుంది? అంటే నిజానికి ఈ రెండు ప్లాన్‌ల మధ్య ఉన్న ఒకే ఒక్క తేడా అన్లిమిటెడ్ కాలర్ ట్యూన్స్ ఫెసిలిటీ.
కేవలం రూ.10 తేడాతో అన్లిమిటెడ్ కాలర్ ట్యూన్స్: కాలర్ ట్యూన్‌లను తరచుగా మార్చడానికి ఇష్టపడే వీఐ యూజర్లకు వీఐ తీసుకొచ్చిన ఈ కొత్త ప్లాన్ ప్రయోజనకరంగా ఉంటుంది. అదనంగా రూ.10 ఖర్చుతో రూ.209 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ తీసుకుంటే రూ. 199 ప్లాన్ మాదిరిగానే అన్ని బెనిఫిట్స్‌తో పాటు అన్లిమిటెడ్ కాలర్ ట్యూన్స్ ఫెసిలిటీ పొందొచ్చు.