Vivo X200 Series Global Launch: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో చైనాలో తన హ్యాండ్‌సెట్‌ను ప్రారంభించిన నెల రోజుల తర్వాత Vivo X200 సిరీస్ గ్లోబల్ లాంచ్‌పై హింట్ ఇచ్చింది. ఇవి మలేషియా మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ వీవో X200 సిరీస్‌లో మూడు మోడల్ మొబైల్స్ ఉన్నాయి. వీటిలో జీస్ ఆప్టిక్స్ కో-ఇంజనీర్డ్ కెమెరా సిస్టమ్‌లు ఉన్నాయి. Vivo X200 లైనప్ ఈ నెలాఖరులో లేదా డిసెంబర్ మొదటి వారంలో ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా వీటి ధర, ఫీచర్లపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.
వీవో X200 సిరీస్‌లో మూడు మోడల్స్ ఇవే:
- Vivo X200
- Vivo X200 Pro
- Vivo X200 Pro Mini
వివో తన మలేషియా ఫేస్బుక్ పేజీలో VivoX200 సిరీస్‌ను శుక్రవారం పరిచయం చేసింది. అయితే మలేషియాలో ఈ సిరీస్‌ను ఎప్పుడు ప్రారంభిస్తుందో కంపెనీ వెల్లడించలేదు. అయితే టీజర్ పోస్టర్ దాని డిజైన్ గురించి సమాచారాన్ని అందిస్తుంది. ఇది వరుసగా Vivo X200, Vivo X200 Mini.. టైటానియం, టైటానియం గ్రీన్ కలర్ ఆప్షన్‌లను చూపుతుంది.
Vivo X200 సిరీస్ స్పెసిఫికేషన్స్:Vivo X200 సిరీస్ అక్టోబర్‌లో చైనాలో 12GB + 256GB స్టోరేజ్ వేరియంట్ CNY 4,300 (దాదాపు రూ. 51,000) ప్రారంభ ధరతో లాంచ్ అయ్యాయి. Vivo X200 లైనప్‌లోని అన్ని మోడల్‌లు MediaTek Dimensity 9400 ప్రాసెసర్‌పై నడుస్తాయి.