Recharge Plans Under Rs.200: ప్రస్తుతం ప్రముఖ టెలికాం సంస్థలు తమ రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచేశాయి. ఈ పెరిగిన రీఛార్జ్ ధరలు వినియోగదారులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. మరీ ముఖ్యంగా డ్యూయల్ సిమ్‌లు ఉన్న వారు ఈ సమస్యతో మరింత ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇలాంటి సమయంలో తక్కువ ధరలో ఎక్కువ వ్యాలిడిటీతో వచ్చే రీఛార్జ్ ప్లాన్లు లేవా? అంటే అవి కూడా ఉన్నాయి. ఈ సందర్భంగా మన దేశంలో టాప్ 3 టెలికాం సంస్థలకు సంబంధించిన బెస్ట్ రీఛార్జ్ ప్లాన్లపై ఓ లుక్కేద్దాం రండి. అది కూడా రూ. 200 లోపు ధరలోనే మార్కెట్లో అందుబాటులో ఉన్న ప్లాన్లు మీకోసం. ఓ లుక్కేయండి మరి!
BSNL రూ. 107 రీఛార్జ్: ఈ బీఎస్ఎన్ఎల్ చౌకైన రీఛార్జ్ ప్లాన్‌లో వినియోగదారులకు డేటా, కాలింగ్ బెనిఫిట్స్ లభిస్తాయి. ఈ ప్లాన్ 50 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇది 200 నిమిషాల ఉచిత వాయిస్ కాల్స్, 3G డేటాను అందిస్తుంది. తక్కువగా కాల్స్ చేసే వినియోగదారులకు ఈ ప్లాన్ ప్రయోజనకరంగా ఉంటుంది. అదనంగా ఈ ప్లాన్‌తో పాటు 50 రోజుల పాటు ఉచితంగా BSNL ట్యూన్స్‌ను కూడా పొందొచ్చు.
BSNL రూ. 153 రీఛార్జ్:ఈ రీఛార్జ్ ప్లాన్‌లో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ బెనిఫిట్ లభిస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. ఈ 28 రోజుల్లో వినియోగదారులు ఏ నెట్‌వర్క్‌కైనా ఉచితంగా కాల్స్ చేయొచ్చు. దీంతోపాటు ప్రతిరోజూ 1GB హై-స్పీడ్ డేటాను పొందుతారు. 1GB లిమిట్ దాటిన తర్వాత ఇంటర్నెట్ వేగం 40kbpsకి తగ్గుతుంది. దీనితో పాటు ప్రతిరోజూ 100 SMSలు కూడా లభిస్తాయి.
BSNL రూ. 199 రీఛార్జ్: బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ నెల రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ 30 రోజుల పాటు అన్లిమిటెడ్ కాల్స్, రూ.153 రీఛార్జ్ కంటే ఎక్కువ డేటాను అందిస్తుంది. దీంతోపాటు ఇందులో రోజుకు 2GB డేటా లభిస్తుంది. ఈ లిమిట్ దాటిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 80kbpsకి పడిపోతుంది. ఈ ప్లాన్‌లో 100 ఉచిత SMSలు కూడా లభిస్తాయి. అంటే ఈ ప్లాన్ మొత్తంగా 30 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్, 60GB డేటా, 3వేల ఉచిత SMSలను అందిస్తుంది.
రూ. 199 జియో ప్రీపెయిడ్ ప్లాన్: మన దేశంలోని అతిపెద్ద టెలికాం సంస్థ రిలయన్స్ జియో బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ లిస్ట్‌లో ఇది ఒకటి. ఈ ప్లాన్‌లో యూజర్లకు రోజుకు 1.5GB డేటా లభిస్తుంది. దీంతోపాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు కూడా లభిస్తాయి. కానీ ఈ ప్లాన్ వ్యాలిడిటీ 18 రోజులు మాత్రమే.