తెలంగాణ

telangana

ETV Bharat / technology

మొదటిసారి కారు కొంటున్నారా?- నో టెన్షన్ గురూ.. వీటితో ఫుల్ క్లారిటీ! - Top Trending Cars With Low Budget - TOP TRENDING CARS WITH LOW BUDGET

Top Trending Cars With Low Budget in India: మొదటిసారి కారు కొనాలని అనుకుంటున్నారా? ఏది కొనాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే మీకోసమే ఈ స్టోరీ. మార్కెట్లో ఫ్రెడ్లీ బడ్జెట్లో అందుబాటులో ఉన్న టాప్ కార్లు ఇవే. వీటిని చూస్తే ఏ కారు కొనాలో మీకు ఒక ఐడియా వస్తుంది.

Top_Trending_Cars_With_Low_Budget_in_India
Top_Trending_Cars_With_Low_Budget_in_India (Maruti, Tata, Hyundai)

By ETV Bharat Tech Team

Published : Sep 1, 2024, 5:34 PM IST

Top Trending Cars With Low Budget in India:ఇంతకుముందు కేవలం ధనవంతుల ఇంట్లోనే కారు ఉండేది. అయితే ప్రస్తుతం ప్రతి ఇంట్లో కారు ఉండటం కామన్ అయిపోయింది. సొంతింటి తర్వాత కారు కొనేందుకే ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో కార్ల సెల్స్ భారీగా పెరిగిపోతున్నాయి. కస్టమర్ల అభిరుచి, ఆసక్తికి తగినట్లుగా అన్ని కంపెనీలు ఎప్పటికప్పుడు సరికొత్త కార్లను లాంచ్ చేస్తున్నాయి. దీంతో కొత్తగా కారు కొనాలని అనుకునేవారు ఏది కొనాలో తెలియక తికమక పడుతున్నారు. దీంతోపాటు వారి బడ్జెట్​లో మంచి మైలేజ్ ఉన్న కారు దొరుకుతుందో లేదో అని సందేహపడుతుంటారు. అలాంటివారి కోసం మార్కెట్లో బెస్ట్ ఫీచర్లతో ట్రెండింగ్​లో ఉన్న టాప్ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీటిని చూస్తే మీ బడ్జెట్​లో ఏ కారు బెస్ట్​గా ఉంటుందో మీకు ఓ క్లారిటీ వస్తుంది.

1. Maruti Suzuki Alto K10:

Maruti_Suzuki_Alto_K10 (Maruti)

మైలేజ్: 24.39 to 33.85 కి.మీ/లీటర్

ఇంజిన్: 998 సీసీ

సేఫ్టీ: 2స్టార్ (గ్లోబల్ ఎన్​క్యాప్)

ఫ్యూయల్ టైప్: పెట్రోల్ అండ్ సీఎన్​జీ

ట్రాన్స్​ మిషన్: మాన్యువల్​ / ఆటోమాటిక్

సింటింగ్ కెపాసిటీ: 4 & 5 సీటర్

ధర: రూ. 4.79 లక్షలు

2. Maruti Suzuki Swift Hatchback:

Maruti_Suzuki_Swift_Hatchback (Maruti)

మైలేజ్: 24.8 to 25.75 కి.మీ/లీటర్

ఇంజిన్: 1197 సీసీ

ఫ్యూయల్ టైప్: పెట్రోల్

ట్రాన్స్ మిషన్: మాన్యువల్ / ఆటోమేటిక్

సీటింగ్ కెపాసిటీ: 5 సీటర్

ధర: రూ. 7.83 లక్షలు

3. Tata Tiago Hatchback​:

Tata_Tiago_Hatchback (Tata)

ఇంజిన్: 1199 సీసీ

టార్క్: 95 ఎన్ఎం- 113 ఎన్​ఎం

మైలేజ్: 19 నుంచి 20.09 కి.మీ/ లీటర్

పవర్: 72.41 - 84.48 బీహెచ్​పీ

ట్రాన్స్ మిషన్: ఆటోమేటిక్ / మాన్యువల్

ఫ్యూయల్ టైప్: పెట్రోల్ అండ్ సీఎన్​జీ

ధర: రూ. 5.65 లక్షల నుంచి రూ. 8.90 లక్షలు(ఎక్స్-షోరూమ్)

4. Hyundai EXTER:

Hyundai_EXTER (Hyundai)

ఇంజిన్: 1197 సీసీ

టార్క్: 95.2 ఎన్​ఎం- 113.8 ఎన్ఎం

డ్రైవ్ టైప్: FWD

పవర్: 67.72 - 81.8 బీహెచ్​పీ

ట్రాన్స్​ మిషన్: మాన్యువల్ / ఆటోమేటిక్

మైలేజ్: 19.2 నుంచి 19.4 కి.మీ/లీటర్

ధర: రూ. 6.13 - 10.43 లక్షలు

ABOUT THE AUTHOR

...view details