How to Choose Best Earbuds:పండగలు ప్రారంభం కానున్న వేళ ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి పలు సంస్థలు బంపర్ ఆఫర్లను ప్రకటించాయి. దీంతో ఈ ఫెస్టివల్ సేల్స్ ఎప్పుడు మొదలవుతుందా? ఏ గ్యాడ్జెట్స్ కొందామా? అంటూ చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఫెస్టివల్ ఆఫర్‌లో దొరికితే మంచి ఇయర్ బడ్స్ కొందామని చూసేవారూ వీరిలో ఉంటారు. తక్కువ ధరకు వస్తున్నాయి కదా అని ఏవి పడితే అవి కొన్నారంటే అవి ఎందుకూ పనికిరాకుండా పోతాయ్! ఇయర్ బడ్స్ కొనుగోలు చేసే ముందు ఈ అంశాలు పరిగణనలోకి తీసుకుంటే మంచిది. అవేంటంటే?
ఇయర్‌బడ్స్ కొనుగోలులో పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు:
- ప్రస్తుతం మార్కెట్లో నెక్ బ్యాండ్, టీడబ్ల్యూఎస్, వైర్ అంటూ రకరకాల ఇయర్‌ఫోన్స్ దొరుకుతున్నాయి.
- వాటిలో బ్లూటూత్ ఆధారంగా పనిచేసే ఇయర్‌బడ్స్‌కు మంచి క్రేజ్ ఉంది.
- వీటి ధరలు రూ.900 నుంచే ప్రారంభమవుతున్నాయి.
- అలాగని తక్కవ ధరకే వస్తున్నాయి కదా అని ఫీచర్లు తెలుసుకోకుండా కొనుగోలు చేస్తే వినియోగంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
- అందుకే ఇయర్ బడ్స్‌ను కొనుగోలు చేసేముందు ముఖ్యంగా నాయిస్ క్యాన్సిలేషన్, బ్యాటరీ లైఫ్, బ్లూటూత్ కనెక్టివిటీ, సౌండ్ క్వాలిటీ వంటి అంశాలను చెక్ చేసుకోవాలి.
బ్యాటరీ:
- బ్లూటూత్ ఇయర్‌బడ్స్ వాడే వారికి లాంగ్ బ్యాటరీ లైఫ్ అనేది ముఖ్యం.
- ట్రూ వైర్‌లెస్ విషయంలో కేస్, ఇయర్‌బడ్స్ వేర్వేరు బ్యాటరీలను కలిగి ఉంటాయి.
- కనీసం రెండూ కలిపి 35 గంటల కంటే ఎక్కువ ప్లే బ్యాకప్ ఉండే ఇయర్‌బడ్స్‌ను సెలెక్ట్ చేసుకోవడం మంచిది.
- సాధారణంగా ఇయర్‌బడ్స్ కంపెనీలు చెప్పేదానికంటే ఒకటీ, రెండు గంటల బ్యాటరీ బ్యాకప్ తక్కువగానే వస్తాయనే విషయం గుర్తుంచుకోవాలి.
లేటెన్సీ:
- ఆడియో, వీడియోను కరెక్ట్ టైమ్‌లో సింక్ చేయడమే లేటెన్సీ.
- ఇది ఎంత తక్కువుంటే అంత బాగా వీడియోను ఆస్వాదించొచ్చు.
- ముఖ్యంగా గేమ్స్ ఆడేవాళ్లు అయితే తక్కువ లేటెన్సీ ఉండే ఇయర్‌బడ్స్‌ను ఎంచుకోవడం మంచిది.
- ఇయర్ ఫోన్స్‌లో గరిష్ఠ లేటెన్సీ 100 మిల్లీ సెకన్లు, యావరేజ్ అయితే 50- 100 మిల్లీ సెకన్లు, తక్కువ అంటే 20- 40 మిల్లీ సెకన్ల ఉంటుంది.
- 20 మిల్లీ సెకన్ల కంటే తక్కువ ఉంటే వాటిని మంచి ఇయర్ ఫోన్స్ కింద భావించొచ్చు.
బ్లూటూత్:
- ఇప్పుడు దాదాపు అన్ని ఇయర్‌బడ్స్‌లో బ్లూటూత్ 5.0+ కనెక్టివిటీతో వస్తున్నాయి.
- వీటిలో 5.3, 5.4 అనేవి లేటెస్ట్ వెర్షన్లు. వీలైనంత వరకు ఈ లేటెస్ట్ వెర్షన్ బ్లూటూత్ ఉన్న ఇయర్ బడ్స్‌ను ఎంచుకోండి.
- ఎందుకంటే మార్కెట్లోకి ఇవి తక్కువ లేటెన్సీ, బెటర్ ఆడియో క్వాలిటీ, రేంజ్‌తో వస్తున్నాయి. పైగా వేగంగా పెయిర్ అవుతాయి.
నాయిస్ క్యాన్సిలేషన్:
- టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ కొనుగోలు చేసేటప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ అనే పదం మనకు తరచూ వినిపిస్తూ ఉంటుంది.
- ఇందులో ఒకటి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్.
- రెండోది పాసివ్ నాయిస్ క్యాన్సిలేషన్.
- దీన్నే ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ అని కూడా పిలుస్తారు.