How To Charge Laptop Fast : ఇటీవల కాలంలో ల్యాప్‌టాప్‌ల అమ్మకాలు బాగా పెరిగాయి. ఎక్కడికైనా తీసుకెళ్లగలిగే సౌలభ్యం ఉండడం వల్ల చాలా మంది డెస్క్‌టాప్ కంప్యూటర్ల కంటే ల్యాప్‌టాప్‌ల వినియోగానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఛార్జింగ్ నెమ్మదిగా జరుగుతుండటం అనేది ల్యాప్‌టాప్‌లలో పెద్ద సమస్యగా పరిణమిస్తోంది. దీనివల్ల సౌలభ్యం కాస్త అసౌకర్యంగా మారుతోంది. ఈ సవాలును అధిగమించి ల్యాప్‌టాప్ ఛార్జింగ్ వేగాన్ని పెంచుకునేందుకు పాటించాల్సిన ఐదు చిట్కాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
1. కుడి ఛార్జర్‌ను ఉపయోగించండి
మీ ల్యాప్‌టాప్‌ను ఛార్జింగ్ చేయడానికి కుడి వైపున ఉండే పిన్‌ను వినియోగించండి. ఎందుకంటే ఆ పిన్‌ను ఛార్జింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించారు. అది మీ ల్యాప్‌టాప్‌లోకి తగినంత పవర్ అవుట్ పుట్‌ను పంపుతుంది. ఒకవేళ మీరు ఏదైనా రీప్లేస్‌మెంట్ ఛార్జర్‌ను ఉపయోగిస్తుంటే, అది ఒరిజినల్ ఛార్జర్ స్పెసిఫికేషన్లతో సరిపోలుతోందా? లేదా? అనేది చెక్ చేయండి. ఛార్జర్ ఓల్టేజీ (V), యాంపిరేజ్ (A) వివరాలను తనిఖీ చేయించండి. మీ ల్యాప్‌టాప్ యూజర్ మాన్యువల్‌లో దీనికి సంబంధించిన సమాచారం మొత్తం లభిస్తుంది.
మీ ల్యాప్‌టాప్ యూఎస్‌బీ సీ-టైప్ పవర్ డెలివరీ (PD) వంటి వేగవంతమైన ఛార్జింగ్ ఆప్షన్లకు సపోర్ట్ చేస్తుందో, లేదో చూడండి. ఒకవేళ అందుకు మీ ల్యాప్‌టాప్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తే, గరిష్ఠంగా 140 వాట్స్ ఛార్జర్‌ను వాడొచ్చు. ఫలితంగా ల్యాప్‌టాప్ ఛార్జింగ్ వేగం బాగా పెరుగుతుంది.
2. ఛార్జ్ చేస్తున్నప్పుడు ఇతర పరికరాలను కనెక్ట్ చేయొద్దు
మీ ల్యాప్‌టాప్‌నకు ఛార్జింగ్ పెట్టినప్పుడు, దానికి ఇతరత్రా ఫోన్లను లేదా యూఎస్‌బీలను కనెక్ట్ చేయకండి. ఇతరత్రా పరికరాలు ఏవైనా ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేసి ఉంటే, కచ్చితంగా ఛార్జింగ్ వేగం తగ్గుతుంది. ఎందుకంటే మీ ల్యాప్‌టాప్ నుంచి ఆయా పరికరాలకు కూడా పవర్ అందాలి. అందుకే ల్యాప్‌టాప్‌నకు అదనంగా పెట్టి ఉన్న ప్లగ్స్ అన్నీ తీసేయండి.
3. ల్యాప్‌టాప్‌ను కూల్‌గా ఉంచాలి!
ఛార్జింగ్‌కు పెట్టడం వల్ల ల్యాప్‌టాప్‌లోని బ్యాటరీలోకి విద్యుత్ శక్తి చేరుతుంది. ఈ క్రమంలో ల్యాప్‌టాప్ వేడెక్కుతుంది. అది చల్లబడాలంటే ల్యాప్‌టాప్ పరిసరాల్లో చల్లని గాలి వీయాలి. అందుకే కనీస స్థాయిలోనైనా గాలి వీచే ప్రదేశంలో ల్యాప్‌టాప్ సిస్టమ్‌ను వినియోగిస్తే మంచిది. ఇలాంటి అనుకూల వాతావరణంలో ల్యాప్‌టాప్ ఛార్జింగ్ జరిగే వేగం బాగా పెరుగుతుంది. ప్రతీసారి ఛార్జింగ్ క్రమంలో ల్యాప్‌టాప్ బాగా వేడెక్కితే, దానిలో అంతర్గత భాగాలు త్వరగా దెబ్బతింటాయి. ల్యాప్‌టాప్‌ను గట్టి, చదునైన ఉపరితలంపై ఉంచడం బెస్ట్. అలాంటి చోట ల్యాప్‌టాప్‌ను ఉంచితే, దాని కింది భాగంలోనూ గాలి స్వేచ్ఛగా ప్రవహించే అవకాశం ఉంటుంది. ల్యాప్‌టాప్‌ను చల్లగా ఉంచడానికి మీరు కూలింగ్ ప్యాడ్ లేదా ల్యాప్‌టాప్ స్టాండ్‌ను వాడొచ్చు.